Rajamouli : నేను మూర్ఖుడిని కాను.. ఆ పేరు చెప్పను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు ఎవరి గురించి?

Published : Feb 28, 2026, 01:59 PM IST

తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.. టాలీవుడ్ లో స్టార్ హీరోలను పాన్ ఇండియా హీరోలుగా మార్చుతూ వస్తోన్న జక్కన్నకు.. ఫెవరేట్ హీరో ఎవరో తెలుసా? 

PREV
14
టాలీవుడ్ దిశను మార్చేసిన రాజమౌళి..

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బాలీవుడ్, కోలీవుడ్ లలో చాలా చిన్న చూపు చూసేవారు. బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి.. తెలుగు పరిశ్రమ గతినే మార్చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి ఏంటంటే.. మన సినిమాలతో పోటీ పడలేక.. డీలా పడిపోతున్నారు. 

అంతటి ఘనత సాధించిన రాజమౌళి.. కిందస్థాయి నుంచి పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు. ఒక సీరియల్ ను డైరెక్ట్ చేసే స్థాయి నుంచి.. హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేసే స్థాయికి వచ్చాడు. తెలుగు హీరోల మార్కెట్ ను భారీగా పెంచిన డైరెక్టర్ రాజమౌళి.

24
రాజమౌళితో పనిచేసిన హీరోలు..

జక్కన్నతో టాలీవుడ్ నుంచి చిన్నా పెద్దా హీరోలు చాలామంది పనిచేశారు. కానీ రాజమౌళి ఎక్కువగా సినిమాలు చేసింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తోనే. తారక్ తో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి , యమదొంగ, ఆర్ఆర్ఆర్ తో కలిపి నాలుగు సినిమాలు చూశాడు. 

ఇక ప్రభాస్ తో చత్రపతి, బాహుబలి, బాహుబలి2 సినిమాలు చేశాడు రాజమౌళి, రామ్ చరణ్ దో మగధీర, ఆర్ఆర్ఆర్ సినిమాలను తెరకెక్కించాడు. ఇక రవితేజ, నాని, సునిల్ లాంటి హీరోలతో కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు జక్కన్న.

34
రాజమౌళి ఫెవరేట్ డైరెక్టర్ ఎవరు?

టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకన్న రాజమౌళి.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. అవతార్ ఫేమ జేమ్స్ క్యామరాన్ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇంత గొప్ప దర్శకుడికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..? ఈ విషయం ఓ సారి ఇంటర్వ్యూలో వెల్లడించారు జక్కన్న. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రాజమౌళి తన మనసులో మాట బయటపెట్టాడు. 

ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరోఎవరు అని అడిగితే.. నా ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి ఇబ్బందుల్లో పడేంత మూర్ఖుడిని కాదు అని ఆయన అన్నారు. దాంతో మీరు కూడా ఇండస్ట్రీలో లౌక్యంతోనే వెళ్లేలా ఉన్నారు .. అని స్టార్ యాంకర్ కితాబిచ్చాడు.

44
మహేష్ బాబు సినిమాతో బిజీ బిజీ..

ప్రస్తుతం రాజమౌళి వారణాసి సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. అసారి ఇంకాస్త గట్టిగా కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఈసినిమా కోసం దాదాపు 1500 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇతర తారాగణంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories