12ఏళ్ల తర్వాత థియేటర్‌లోకి విశాల్‌ సినిమా.. అంజలి, వరలక్ష్మి హీరోయిన్లుగా రచ్చ, విజయ్‌ ఆంటోని, సదా ఏం చేశారంటే

First Published | Jan 3, 2025, 11:43 PM IST

విశాల్‌ సినిమాలు చాలా వేగంగా విడుదలవుతుంటాయి. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. కానీ ఒక్క మూవీ మాత్రం 12ఏళ్లుగా ల్యాబ్‌లో మూలుగుతూనే ఉంది. దానికి ఇప్పుడు మోక్షం కలిగింది. 

మధ గజ రాజా

సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన సినిమా `మధ గజ రాజా`. ఈ సినిమాలో సంతానం కమెడియన్‌గా నటించారు.  జెమిని ఫిలిం సర్క్యూట్ నిర్మించింది. ఈ సినిమాలో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించడం విశేషం. హీరోయిన్‌ సదా ఒక పాటకు ఐటెం డాన్స్ చేశారు. ఈ సినిమాకి విజయ్ ఆంటోని సంగీతం అందించారు. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందించారు.

'మధ గజ రాజా' విడుదల తేదీ

`మధ గజ రాజా` సినిమాని 2012లో ప్రారంభించారు, 2013లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా కొన్ని సమస్యల కారణంగా 12 ఏళ్లుగా విడుదల కాలేదు. ఈలోగా సినిమా విడుదల తేదీని ప్రకటించినా, అది విడుదల కాలేదు. 12 ఏళ్ల తర్వాత `మధ గజ రాజా` సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.

read more: ఆకతాయి వేధింపులు.. హీరోయిన్‌ మీనా కోసం కెప్టెన్ విజయకాంత్ ఎంత రిస్క్ చేశాడో తెలుసా?


'మధ గజ రాజా' సంక్రాంతికి

 జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా `మధ గజ రాజా` సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కమెడియన్‌గా నటించిన సంతానం ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ఈ సంక్రాంతికి ఇప్పటికే 10 సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో, ఆ జాబితాలో 11వ సినిమాగా విశాల్ `మధ గజ రాజా` చేరింది.

సంక్రాంతి సినిమాలు

`మధ గజ రాజా`తో పాటు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్', జయం రవి నటించిన 'కాదలిక్క నేరమిల్లై', విష్ణువర్ధన్ దర్శకత్వంలో అదితి శంకర్ నటించిన 'నేసిప్పాయ', విజయకాంత్ కొడుకు శన్ముగపాండియన్ నటించిన 'పడై తలైవన్', సిబిరాజ్ 'టెన్ అవర్స్', కిషాన్ దాస్ నటించిన 'తరుణం',

షాన్ నిగమ్ నటించిన మూవీ, సుశీంద్రన్ దర్శకత్వంలో '2కె లవ్ స్టోరీ', బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన 'వణంగాన్', మిర్చి శివ నటించిన 'సుమో' వంటి సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ సంక్రాంతికి తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా సినిమాల సందడి ఉండబోతుందని చెప్పొచ్చు. 

read more: 7 ఏళ్లలో 7 సార్లు రీమేక్‌, ప్రతి భాషలోనూ సూపర్ హిట్టే!

also read: జూ ఆర్టిస్ట్ లు కృష్ణంరాజుని బట్టలు చిరిగేలా కొట్టారా? అసిస్టెంట్‌ కారణం పాపం రెబల్‌ స్టార్‌కి దారుణమైన అనుభవం

Latest Videos

click me!