
మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో హీరోగా రాణిస్తున్నారు. ఎలాంటి బాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో నటుడిగా ఎదిగాడు. మెగాస్టార్ గా రాణిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు 156 సినిమాలు చేశారు.
దాదాపు ఈ ఐదు దశాబ్దాల జర్నీలో తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశారు. అవమానాలు ఎదుర్కొన్నారు, కెరీర్ పీక్‌ని చూశారు. అన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తున్నారు.
చిరంజీవి క్రమశిక్షణకు మారు పేరు అంటుంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల నుంచి అది నేర్చుకున్నారు చిరు. సినిమా షూటింగ్ అవుతుందంటే సెట్‌లో అరగంట ముందే ఉండేవారని ఆయనతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, ఇతర ఆర్టిస్ట్, టెక్నీషియన్లు చెబుతుంటారు.
అప్పట్లో ఎలాంటి యాక్షన్ సీన్లు అయినా ఆయనే స్వయంగా చేసేవారట. అదే సమయంలో షూటింగ్‌లో టైమ్ వేస్ట్ అవ్వడానికి కూడా ఒప్పుకునే వారు కాదట. ముఖ్యంగా తన వల్ల లేట్ అనే దాన్ని సహించలేరట.
ఈ క్రమంలో ఇతరులకు కొంత ఇబ్బంది కలిగిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే `ఘరానా మొగుడు` సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘటన పంచుకున్నారు హీరో జేడీ చక్రవర్తి. ఆయన మెగాస్టార్ కి పెద్ద అభిమాని కూడా.
కానీ చిరంజీవి ఒక దుర్మార్గుడు, సెట్‌లో రాక్షసత్వం చూపించాడని కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన్ని ఆ సమయంలో అసహ్యించుకున్నట్టు తెలిపారు జేడీ చక్రవర్తి. మరి ఇంతకి ఏం జరిగిందంటే.
అది 1992. జేడ చక్రవర్తి.. రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. వీరు నాగార్జునతో `అంతం` మూవీని రూపొందిస్తున్నారు. అదే సమయంలో చిరంజీవి `ఘారానా మొగుడు` సినిమా షూటింగ్ జరుగుతుంది.
వీరి రెండు సినిమాలు పక్క పక్కనే చిత్రీకరణ జరుగుతున్నాయట. ఆ సమయంలో `ఘరానా మొగుడు` క్లైమాక్స్ షూట్ చేస్తున్నారట. అందులో భాగంగా చిరంజీవిపై యాక్షన్ సీన్లు తీస్తున్నారు. వరుసగా ఎనిమిది రోజుల షూటింగ్ అది.
ఫైటర్లు మారుతున్నారు, యూనిట్లు మారుతున్నాయి. కానీ చిరంజీవి మాత్రం ఆ ఎనిమిది రోజులు అక్కడే కారులోనే పడుకున్నాడట. అప్పుడు కార్వాన్ లేదు. షాట్ గ్యాప్‌లో వెళ్లి తన కారులోనే బయటపడుకునేవాడట చిరు.
ఆయనొక సూపర్ స్టార్, పైగా తన అభిమాన హీరో. అలాంటిది ఇలా కారులో పడుకోవడం జేడీకి నచ్చలేదట. దీంతో చిరు వద్దకు వెళ్లి సర్ మీరు మేకప్ రూమ్‌లో పడుకోవచ్చు, కానీ ఇలా కారులో పడుకోవడం ఏం బాగాలేదు, నాకు నచ్చడం లేదు అన్నాడట.
అప్పుడు చిరంజీవి చెప్పిన మాటలకు షాక్ అయ్యాడట జేడీ. `ఏం లేదండీ, ఇప్పుడు నేను లోపల పడుకుంటే మోహన్(అసిస్టెంట్) లేపడు. బయటేపడుకుంటే డైరెక్టర్ మైక్‌లో రెడీ రెడీ, చిరంజీవిగారిని పిలవండి అనగానే నేను లేచి వెళ్లిపోతున్నా, ఆ గ్యాప్ కూడా ఇవ్వకూడదు అన్నారు` అని తెలిపారు జేడీ చక్రవర్తి. ఆయన పని రాక్షసుడు అని తెలిపారు జేడీ.
చిరంజీవిపై ప్రేమతోనే ఆయన ఈ కామెంట్ చేయడం విశేషం. ఇక `ఘరానా మొగుడు` మూవీ 1992 ఏప్రిల్ 9న విడుదలై పెద్ద హిట్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లకి 10 కోట్ల షేర్‌ని సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.