బాలకృష్ణ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కి ఖాతా ఓపెన్ చేశాడు. తాజాగా ఆయన `డాకు మహారాజ్`తో హిట్ టాక్‌ని అందుకుంటున్నారు. నేడు విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉందని అంటున్నారు. కొన్ని మైనస్‌లు ఉన్నా పండక్కి నడిచిపోయే మూవీ అవుతుందంటున్నారు. ప్రెస్ మీట్‌లో కూడా టీమ్ తమ సంతోషాన్ని వెల్లడించారు. పెద్ద రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ కాబోతుందని అన్నారు.
ఈ నేపథ్యంలో `డాకు మహారాజ్` టీమ్ తాజాగా సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఆదివారం రాత్రి గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో టీమ్‌తోపాటు బాలయ్య సన్నిహితులు, యంగ్ హీరోలు కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనడం విశేషం. ఈ నేపథ్యంలో గట్టిగా పార్టీ చేసుకుంటూ బాలయ్యతో కలిసి సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ.
అయితే ఇందులో ఈ ముగ్గురు హీరోలు కలిసి ముద్దులాట హైలైట్‌గా నిలిచింది. `డాకు మహారాజ్` సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, `కంగ్రాట్చ్యూలేషన్స్ టూ డాకు మహారాజ్` అని విశ్వక్ సేన్ అనగా, థ్యాంక్యూ లైలా అంటూ విశ్వక్ సేన్‌కి ముద్దు పెట్టాడు బాలయ్య. నా సక్సెసే మీ సక్సెస్ అని, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్ అని పేర్కొన్నారు. అనంతరం బాలయ్యకి కిస్ పెట్టాడు విశ్వక్ సేన్. ఇంతలో సిద్దు జొన్నలగడ్డ వచ్చాడు.
నాకు పెట్టలేదు(కిస్) అనగా, సిద్దుకి ముద్దు పెట్టాడు బాలయ్య. అనంతరం బాలయ్యకి ముద్దు పెట్టాడు సిద్దు. ఇలా ముగ్గురు ముద్దులతో రెచ్చిపోయారు. హీరోయిన్లని పక్కన పెట్టి హీరోలే ఇలా ముద్దులు పెట్టుకోవడం, దాన్ని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం హైలైట్‌గా నిలిచింది.
మరోవైపు దర్శకుడిగా బాబీకి కూడా కిస్ పెట్టారు బాలయ్య. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. పార్టీ మూడ్‌లో ఇలా రెచ్చిపోవడంతో ఇది పెద్ద వైరల్‌గా మారింది. పెద్ద రేంజ్‌లో రచ్చ అవుతుంది. ఈ వీడియోలో అంతా పార్టీ మూడ్‌లో ఉన్నారు. పాటల సందడితో మాంచి కిక్ ఇచ్చేలా ఉంది. అందరు మంచి కిక్‌లో ఉన్నారని అర్థమవుతుంది.
ఇక బాలకృష్ణ హీరోగా నటించిన `డాకు మహారాజ్` సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా, బాబీ డియోల్ నెగటివ్ రోల్లో నటించారు. నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా చాలా గ్రాండ్‌గా నేడు ఆదివారం సినిమా విడుదలైంది. ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ వస్తుంది.
అయితే కథ పెద్దగా లేదని, సెకండాఫ్ డల్‌గా ఉందని, రొటీన్‌గా ఉందని అంటున్నారు. కానీ బాలయ్య మార్క్ యాక్షన్, ఎలివేషన్ సీన్లు హైలైట్ అని, అవే సినిమాని నిలబెట్టాయని, ఫ్యాన్స్ ఊగిపోయేలా చేస్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి బాలయ్య `డాకు మహారాజ్`తో హిట్ కొట్టబోతున్నాడని అర్థమవుతుంది. వరుసగా నాల్గో హిట్ కాబోతుంది.
read more: తల లేని మనిషి కథతో ‘డాకు మహారాజ్’ ప్రీక్వెల్ ప్రకటన
also read: 'డాకు మహారాజ్' OTT లో ఎప్పుడు వస్తుంది?