Vishal Love Rumors: విశాల్ నటించిన ఏ సినిమా హిట్ కొట్టని సమయంలో `మార్క్ ఆంటోనీ` సినిమా విశాల్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత వచ్చిన `రత్నం` మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 12 ఏళ్ల తర్వాత సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన `మద గజ రాజ` సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇది తమిళంలో యాభై కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. దీంతో ఇప్పుడు విశాల్ గురించే చర్చ జరుగుతోంది. `మద గజ రాజ` సినిమా సూపర్ హిట్. దీని వల్ల ఆగిపోయిన ఆయన సినిమాలు తిరిగి థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి.
47 ఏళ్ల విశాల్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. 2019 లో విశాల్ కి, అనిషా రెడ్డికి నిశ్చితార్థం జరిగింది. ఆరు నెలల తర్వాత పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత విశాల్ పేరు చాలా మంది హీరోయిన్లతో లింక్ చేసిన కథనాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు విశాల్, అభినయ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ డ్యూయల్ రోల్ లో నటించిన టైం ట్రావెల్ సినిమా `మార్కో ఆంటోని` మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో విశాల్ కి భార్యగా అభినయ నటించింది. దీంతో అప్పుడు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. `మార్క్ ఆంటోనీ` సినిమాలో అభినయకి అవకాశం రావడానికి కారణం ప్రేమే అని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అభినయ స్పష్టత నిచ్చింది. `నాడోడిగళ్` సినిమాతో పేరు తెచ్చుకున్న అభినయ ఈసన్, తని ఒరువన్, కుట్రం 23, నిశబ్దం, కుట్రం పురిందాల్, విழிతిరు` వంటి సినిమాల్లో నటించింది.
గత ఏడాది జోజు జార్జ్ దర్శకత్వంలో వచ్చిన `పని` సినిమా హిట్ అయ్యింది. ఇందులో జోజు జార్జ్ కి భార్యగా అభినయ నటించింది. ఆమె నటన, అందం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రేమ వార్తలపై అభినయ స్పందించింది. 15 ఏళ్లుగా తన బాల్య స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, ఇకపై ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. విశాల్ తో ప్రేమ వార్తలకు చెక్ పెట్టింది.
15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న తన ప్రియుడి గురించి అభినయ ఏమీ చెప్పలేదు. అతను నటుడా లేక ఇంకెవరైనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అభినయ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటించింది.
read more: Rajasekhar: యంగ్ హీరోకి తండ్రిగా రాజశేఖర్.. యాంగ్రీ హీరోకి ఏమైంది? భారీ రెమ్యూనరేషన్