Lavanya Tripathi Come Back: లావణ్య త్రిపాఠి కమ్‌ బ్యాక్‌ మూవీ స్టార్ట్, ఆ రూమర్లకి చెక్‌ పెట్టిన మెగా కోడలు

Published : Feb 03, 2025, 03:53 PM ISTUpdated : Feb 03, 2025, 04:05 PM IST

Lavanya Tripathi Sathi Leelavathi:వరుణ్‌ తేజ్‌ వైఫ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ నేడు గ్రాండ్‌గా ప్రారంభమైంది.   

PREV
13
Lavanya Tripathi Come Back: లావణ్య త్రిపాఠి కమ్‌ బ్యాక్‌ మూవీ స్టార్ట్, ఆ రూమర్లకి చెక్‌ పెట్టిన మెగా కోడలు
Lavanya Tripathi

Lavanya Tripathi Sathi Leelavathi: హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి.. హీరో వరుణ్‌ తేజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితమే వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సినిమాలు చేయలేదు లావణ్య. అయితే ఆమె సినిమాలు చేస్తుందని టీమ్‌ తెలిపింది. వరుణ్‌ తేజ్‌ కూడా ఈ మధ్య దీనిపై స్పందించారు. ఒకప్పటిలా ఇప్పుడు ఎవరూ లేరు, పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారని తెలిపారు. లావణ్య కూడా చేస్తుందని స్పష్టం చేశారు. 
 

23
Lavanya Tripathi, Sathi Leelavathi movie opening

ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి కమ్‌ బ్యాక్‌ మూవీని ఆ మధ్యనే ప్రకటించారు. దీనికి `సతీ లీలావతి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ ప్రారంభమైంది. సోమవారం దీన్ని ప్రారంభించారు. ఈ సినిమాని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠికి జోడీగా దేవ్‌మోహన్‌ నటిస్తున్నారు. ఆయన గతంలో `శాకుంతలం` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. 

33
Lavanya Tripathi, Sathi Leelavathi movie opening

`భీమిలీ కబడ్డీ జట్టు`, `ఎస్‌.ఎం.ఎస్‌`(శివ మ‌న‌సులో శృతి)త‌దిత‌ర విభిన్న‌ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య దర్శకత్వంలో నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి నిర్మాత‌లుగా ఈ మూవీ రూపొందబోతుంది.  సోమవారం ఉద‌యం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జ‌రిగాయి.

ఈ కార్య‌క్ర‌మంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, చిత్ర స‌మ‌ర్ప‌కులు జెమినీ కిర‌ణ్‌, నిర్మాతలు హ‌రీష్ పెద్ది, వి.ఆనంద ప్ర‌సాద్, అన్నే ర‌వి, డైరెక్ట‌ర్ తాతినేని స‌త్య తండ్రి, సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌ టి.ఎల్‌.వి.ప్ర‌సాద్ స‌హా ప‌లువురు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత హ‌రీష్ పెద్ది క్లాప్ కొట్టారు. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్  కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా,సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌ టి.ఎల్‌.వి.ప్ర‌సాద్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య మాట్లాడుతూ, `ఆహ్లాదాన్ని క‌లిగించే చ‌క్క‌టి ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘సతీ లీలావతి’ రూపొందుతుంది. మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వుకునే రొమాంటిక్ డ్రామా. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించే అంశాల‌తో తెరకెక్కిస్తున్నాం. లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ జోడీ ఫ్రెష్ లుక్‌తో మెప్పించ‌నున్నారు.

సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. చిత్ర నిర్మాత‌లు నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి మాట్లాడుతూ , `తాతినేని స‌త్య‌గారు స్క్రిప్ట్ చెప్ప‌గానే నేటి త‌రం ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే సినిమా అనిపించింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులను మెప్పించే సినిమాగా దీన్ని రూపొందిస్తున్నాం. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం` అని అన్నారు. హీరో వరుణ్‌ తేజ్‌కి, నిర్మాత కిరణ్‌కి వారు ధన్యవాదాలు తెలిపారు.  

ఇటీవల లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్‌ అయ్యిందనే రూమ్లు వచ్చాయి. తాజాగా సినిమా ప్రారంభించి ఆ రూమర్లకి చెక్‌ పెట్టింది. ఇకపై తాను వరుసగా సినిమాలు చేయబోతుందనే విసయాన్ని స్పష్టం చేసింది. పిల్లలకు టైమ్‌ తీసుకుంటున్నట్టు దీని బట్టి అర్థమవుతుంది. 

read  more: 100 Crore Loss movies: వంద కోట్లకుపైగా నష్టాలను తెచ్చిన సినిమాలు.. ప్రభాస్‌, రామ్‌ చరణ్‌ సేమ్‌, సూర్య టాప్‌

also read: Anasuya Comments: ఫుడ్‌ లాగే అది కూడా ప్రాథమిక అవసరం, బల్లగుద్ది చెప్పిన అనసూయ.. ట్రోలర్స్ కి మైండ్‌ బ్లాక్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories