Ennenno Janmala Bandham: యష్ ని మీట్ అయిన విన్నీ.. మాస్టర్ ప్లాన్ వేసిన భ్రమరాంబిక?

First Published Jan 26, 2023, 12:50 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 26వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో సులోచన ఫ్యామిలీ మాలిని ఫ్యామిలీ అందరూ భోగి మంటల దగ్గర కూర్చుని ఉండగా అప్పుడు ఖుషి అమ్మా ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు అని వేదని అడగగా నేను చెప్తాను ఖుషి అని సులోచన ఖుషిని దగ్గరికి పిల్చుకొని భోగి పండుగను ఎందుకు జరుపుకుంటారు భోగి పండుగ విశిష్టత గురించి చెబుతూ ఉంటుంది. అప్పుడు ఖుషి అమ్మమ్మ నాకు ఏమీ అర్థం కాలేదు అనడంతో వెంటనే మాలిని సెటైర్లు వేస్తూ మీ అమ్మమ్మ చెప్పేది అర్థం కాదు నేను చెప్తాను ఇలా రా అని అంటుంది. అప్పుడు మాలిని ఖుషి కి అర్థం అయ్యేవిధంగా చెబుతుంది. అప్పుడు ఖుషి వేద యష్ ల దగ్గరికి వెళ్లి అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరు నాకు భోగి పండుగ గురించి బాగా చెప్పారు ఇప్పుడు నేను మీకు చెబుతాను చెప్పినట్టు చేయాలి అని అంటుంది ఖుషి.

అమ్మ నువ్వు నాన్న మీద కోప్పడతావు కదా నాన్న నువ్వు అమ్మ మీద చిరాకు పడతావు కదా. మీరిద్దరూ ఆ కోపాలు చిరాకులు అన్ని ఆ భోగి మంటలు వేసేయండి. సంక్రాంతి పండుగ నుంచి అమ్మ నువ్వు మళ్ళీ నాన్న మీద ఫ్రెష్ గా అలుగు నాన్న నువ్వు అమ్మ మీద ఫ్రెష్ గా చిరాకుపడు అని అనడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు అందరూ సరదాగా జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు చిత్ర జాబ్ కి ప్రిపేర్ అవుతూ ఉండగా ఇంతలో వసంత్ అక్కడికి వచ్చి ఎందుకు నన్ను పిలిచావు అని అడగడంతో నాకు గంటకి కాఫీ ఇవ్వు కాలు నొప్పి పెడితే కాళ్లు వత్తాలి అనడంతో సరే అని అంటాడు వసంత్. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. 
 

ఆ తర్వాత అందరూ కలిసి భోగి మంటల దగ్గర డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అందరూ కలిసి సరదాగా డాన్స్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. మేము చిన్నప్పటి రోజులు ఇలానే చేసేవాళ్లం అని మాలిని అనడంతో మేము కూడా ఇలాగే చేసేవాళ్లను వదిన అని సులోచన అంటుంది. అప్పుడు వేద విన్నీ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎవరికోసం ఎదురు చూస్తున్నావమ్మా వేదా అనడంతో మీకు చెప్పాను కదా మావయ్య నా ఫ్రెండ్ విన్నీ కోసం ఎదురుచూస్తున్నాను అంటుంది వేద. అప్పుడు యష్ మనసులో ఆ పండగ పూట్ల ఆ పిడత మొకం వాడి చూడడం అవసరమా న్యూసెన్స్ చేస్తుంది అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి విన్నీ రావడంతో వేద వెళ్ళి విన్నీ ని రిసీవ్ చేసుకుని అందరికీ పరిచయం చేస్తూ ఉండగా వీళ్ళందరూ నాకు బాగా తెలుసు.
 

 అందరి పేర్లతో సహా అందరి గురించి చెప్పడంతో అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మా అందరి గురించి మీకెలా తెలుసు బాబు అని మాలిని అడగడంతో వేదా మీ అందరికి చెప్పింది ఆంటీ అని అంటాడు విన్నీ. అప్పుడు విన్నీ ఖుషి ఇద్దరు ఫ్రెండ్స్ అవడంతో ఎదురు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వేద ఈయన ఎక్కడికి వెళ్లారు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత యష్ ఒక చోట నిలబడి ఉండగా ఇంతలో అక్కడికి విన్నీ వేద ఇద్దరు వెళ్తారు. అప్పుడు యష్, విన్నీ ఒకరి వైపు ఒకరు చూసుకుని నువ్వా నువ్వా అని అనడంతో అప్పుడు వేద అదేంటి మీ ఇద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందా అని అడుగుతుంది. ఆల్రెడీ కలిసారా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడుగుతుంది వేద.

మేమిద్దరం ఆల్రెడీ వెల్కం హోటల్ దగ్గర పోట్లాడుకున్నాము అనగా అయ్యో మీ ఇద్దరికీ పోట్లాడుకోవడం ఏంటి విన్నీ తరుపున నేను సారీ చెబుతున్నానండి అని అంటుంది వేద. అప్పుడు వేద యష్ విన్నీలను కన్వీన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు మా మాటలు నమ్మేసావా వేదు జస్ట్ జోకింగ్ అనడంతో అవును జోక్ అంటాడు యష్. తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు యష్, విన్నీ. అప్పుడు విన్నీ కాల్ రావడంతో పక్కకు వెళ్ళిపోతాడు..  అప్పుడు వేద సో మీరు హోటల్ కి వచ్చారన్నమాట అనడంతో తడబడుతూ ఉంటాడు. అప్పుడు చెప్పు అని అనడంతో వేద తప్పించుకుని వెళ్ళిపోతాడు. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతున్నారన్నమాట ఇదేదో బాగుంది అనుకుంటూ ఉంటుంది వేద.

మాళవిక పడుకుని ఉండడంతో ఇంతలో కైలాష్ అక్కడికి వచ్చి సిస్టర్ లేవండి సిస్టర్ ఇంకా పడుకున్నారా అక్కడ గోరాలు జరిగిపోతున్నాయి అని మాళవికను పిలుచుకొని వెళ్తాడు. మరోవైపు భ్రమరాంబిక చక్కగా తల స్నానం చేసి ముగ్గులు వేస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మాళవిక కైలాష్ వస్తారు. అప్పుడు స్వారీ వదిన ఏమీ అనుకోవద్దు మర్చిపోయాను.అలాగే పడుకుని ఉన్నాను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్తుంది మాలిని. అప్పుడు కైలాష్ ఇది కలా నిజమా మీరేంటి ఇలా ముగ్గు వేయడం ఏంటి మేడం అని అంటాడు. ఏంటి కైలాస్ నా ప్రవర్తన నీకు అర్థం కావడం లేదా అనడంతో అవును మేడం అని ఉంటాడు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు ఆ మాళవిక నన్ను నమ్మితే నా పని ఇంకా సులువుగా పూర్తవుతుంది అదిరిపోయింది మేడం అనుకుంటూ ఉంటాడు.
 

మరొకవైపు విన్నీ మీద ఫ్యామిలీతో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి యష్ వస్తాడు. చాలు బాబు నీ జోకులు విని మా కడుపు పగిలిపోయేలా ఉంది కాపు అని అంటారు. ఇంతలోనే అక్కడికి వేద వచ్చి అందరికీ కాఫీ తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా విన్నీ సీరియస్ అవుతూ నేను అమెరికా నుంచి ఎందుకు వచ్చానో తెలుసా అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు వేద చేసే ఫిల్టర్ కాఫీ తాగడానికి అనడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు.

click me!