మరోవైపు అభి కూడా పార్టీకి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా నేను కూడా వస్తాను బంగారం ఇంట్లో బోరింగ్ గా ఉంది అని మాళవిక అనడంతో మా అక్క ఒప్పుకునే వరకు మనకు ఈ కష్టాలు తప్పవు కొద్ది రోజులు వెయిట్ చెయ్ ఏం కాదు అంటాడు అభి. అప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు అభి. మరోవైపు వేద,యష్ కోసం ఎదురుచూస్తూ ఏంటిది ఈయన ఫోనే పని చేయట్లేదు అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి విన్నీ వస్తాడు. ఏంటి మీ ఆయన కోసం ఎదురు చూస్తున్నావా అని విన్నీ అడగగా లేదు అని వేద కవర్ చేయడంతో ఒకరి కోసం ఎదురుచూపులు ఎలా ఉంటాయో నాకు తెలుసు నువ్వు కవర్ చేయకు అంటాడు విన్నీ. ఇప్పుడు విన్నీ వేద అందం గురించి పొగుడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు యష్ పార్టీకి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు.