సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతున్న తెలుగు అందం.. చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న నటి లయ

First Published | Feb 7, 2023, 11:49 AM IST

తెలుగు హీరోయిన్ లయ (Laya) సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. 
 

ఫ్యామిలీ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో  అలరించిన హీరోయిన్ లయ (Laya) ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కేరీర్ ను వదులుకున్న ఈ బ్యూటీ ఫ్యామిలీతోనే సమయం గడుపుతున్నారు. 
 

అచ్చమైన తెలుగమ్మాయి, సీనియర్ హీరోయిన్ లయ ఏపీలోని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. సినిమాలపై మక్కువతో చైల్డ్ ఆర్టిస్ట్ గానే వెండితెరపై తెలుగు ప్రేక్షకులను అలరించారు.  1992లో వచ్చిన ‘భద్రం కొడుకో’ చిత్రంలో బాలనటిగా మెప్పించింది. 
 


ఆ తర్వాత  కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చి హీరోయిన్ గా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. లయ నటించిన ‘స్వయంవరం’ చిత్రం ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా చెప్పొచ్చు. నటుడు వేణు తొట్టెంపూడి సరసన లయ హీరోయిన్ గా మొట్టమొదటి చిత్రమిది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చి విజయం సాధించింది.
 

తొలిచిత్రంతోనే హిట్ అందుకున్న లయ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది. టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంది. ఇలా ఫ్యామిలీ సినిమాలతో 2006 వరకు అలరించింది. ఇక తెలుగుతో పాటు కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ మెరిసింది. 
 

అయితే అప్పటికే కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని లయ పెళ్లి చేసుకుంది. 2006లోనే ఈ తెలుగు హీరోయిన్ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. లయ ప్రస్తుతం కుటుంబంతో సహా అమెరికాలో నివసిస్తున్నారు. 
 

 సినిమాలకు దూరంగా ఉన్నా... నెట్టింట మాత్రం తన అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు.  తాజాగా పర్పుల్ కలర్ శారీలో మెరిసింది. వయస్సు పెరిగినా అందం ఏమాత్రం తగ్గలేదని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Latest Videos

click me!