తను మా అమ్మ మీద కంప్లైంట్ చేస్తుంది అంటే మా అమ్మ రాక్షసిలాగా కనిపిస్తుందా అయినా ప్రతిసారి ఎందుకు నన్నే కన్విన్స్ చేయాలని చూస్తారు మీ కూతురికి భర్తతో ఎలాగో మెలగాలో నేర్పించండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. మరోవైపు లాస్య దగ్గరికి వచ్చి తన తల్లిదండ్రుల దగ్గర జోలికి తులసి జోలికి రాకుండా ఉండేటట్లు అయితే లాస్య తో కలిసి ఉంటానని కండిషన్ పెడతాడు నందు. లాస్య తన కండిషన్ కూడా చెప్తుంది. తరువాయి భాగంలో లాస్యతో కలిసి కెఫ్ కి వెళ్తున్న నందుని చూసి షాక్ అవుతారు తులసి, పరంధామయ్య దంపతులు.