ఏం మాట్లాడుతున్నావమ్మ నా ప్రాణమే అను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇలాంటివన్నీ నమ్మే స్థితిలో లేను అంటాడు ఆర్య. అలా తీసిపారేయకు జోగమ్మ చెప్పినవన్నీ ఇప్పటివరకు జరిగాయి. అనుకూడా జోగమ్మ మాటల్ని ఎంతగా నమ్ముతుందో నీకు తెలుసు కదా అంటుంది శారదమ్మ. నీరజ్ కూడా నేను, జెండే వెతుకుతాము. వదినమ్మ ని తీసుకువచ్చే బాధ్యత మాది మీరు ప్రాణాలతో ఉంటేనే కదా మేమందరం బాగుండేది అని నచ్చచెప్తాడు.