Intinti Gruhalakshmi: బసవయ్య నోరు మూయించిన విక్రమ్.. లాస్య చేసిన పనికి షాకైన తులసి!

First Published Apr 27, 2023, 8:37 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ అని సంపాదించుకుంటుంది. కొడుకుని వీలు బొమ్మను చూసి ఆడిస్తున్న ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 27 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో అదేంటి మొదటి రాత్రి ఈరోజు అనుకున్నాము కదా అని తులసి అనగా అంటే ఏంటి మా అక్క కావాలని మొదటి రాత్రి జరుపుకుండా చేస్తుందా అని బసవయ్య అంటాడు. మేము అలా అనట్లేదు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని పరంధామయ్య అంటాడు. అప్పుడు విక్రమ్ మీరు ఆగండి మావయ్య మధ్యలో మాట్లాడొద్దు అంటాడు. మీ సొంత మేనమామని రా అని అంటాడు బసవయ్య. అక్కడ ఉన్నది నాకు పిల్లనిచ్చిన అత్తమావలు మధ్యలో దూరొద్దు అంటాడు విక్రమ్. ముహూర్తం బాలేక పోతే మనమేం చేస్తాము, పోని ముహూర్తం తో సంబంధం లేకుండా మొదటి రాత్రి జరిపిద్దామా, మీరు సరే అంటే చేసేద్దాము అని రాజ్యలక్ష్మి అనగా సరే అని నందు అంటాడు.

దానికి రాజ్యలక్ష్మి ఆశ్చర్య పోతుంది. మీకేం తెలీదు ఊరుకోండి పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి అని నందుతో చెప్తుంది. ఎప్పుడు మంచిదైతే అప్పుడే చేయిద్దాము అని రాజ్యలక్ష్మి తో   అంటుంది తులసి. తర్వాత సీన్లో రాజ్యలక్ష్మి, బసవయ్య భోజనాల దగ్గర కూర్చుంటున్నప్పుడు ఇప్పుడు చూడక్క విక్రమ్ కింద కూర్చుంటాడు, అది చూసిన దివ్య పైన కూర్చోమని విక్రమ్ ని బలవంతం పెడుతుంది. విక్రమ్ కచ్చితంగా పైకి రాడు అప్పుడు ఇక్కడ జరిగే గొడవ చూడాలి అని సంబరంగా అంటాడు బసవయ్య.
 

Latest Videos


విక్రమ్ ధనవంతుడు, మంచి అల్లుడు అనుకుంటున్నారు  వాడు నా కాళ్ళ కింద చెప్పుతో సమానం అని ఈరోజు చూపిస్తాను, వాళ్ల స్థానం ఏంటో వాళ్ళకి తెలియజేస్తాను అంటుంది రాజ్యలక్ష్మి. ఇంతలో అందరూ భోజనాల దగ్గరకు వస్తారు. విక్రమ్ చివర్లో వచ్చి కింద కూర్చుంటాడు. అదేంటి బాబు కింద కూర్చుంటున్నారు అని తులసి అడిగితే నాకు అలవాటేనండి ఏమి పర్వాలేదు అంటాడు విక్రమ్. అప్పుడు బసవయ్య నిజం చెప్పు బాబు  ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, చిన్నప్పుడు మా అక్కకి ఒంట్లో బాగోకపోతే నయం కావడానికి జీవితాంతం నేల మీద భోజనం చేస్తాడు అని మొక్కుకున్నాడు అందుకే హలో కింద భోజనం చేస్తున్నాడు అంటాడు. 

 ఇప్పుడు దివ్య కచ్చితంగా వెళ్లి అడ్డుకుంటుంది, గొడవ అవుతుంది అని అనుకుంటుంది రాజ్యలక్ష్మి.కానీ దివ్య, విక్రమ్ పక్కనే వెళ్లి కింద కూర్చుంటుంది. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని దివ్యని అడుగుతాడు విక్రమ్. భర్త అడుగుజాడల్లోనే భార్య కూడా నడుస్తుంది నువ్వెక్కడుంటే నేను అక్కడే కదా అని చెప్పి దివ్య కూడా అక్కడే కూర్చుని తింటుంది. నా మనవరాలు నాలాంటిదే అని మురిసిపోతుంది అనసూయ. పరంధామయ్య, తులసిలు ఆనందపడగా నందు ముఖం మాత్రం అనుమానంగా ఉంటుంది.

ఆ తర్వాత సీన్లో అందరూ  కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుతూ ఉండగా దివ్య చిన్న పిల్లలా నా ముందే తిరుగుతూ ఉండేది, ఇప్పుడు ఒక ఇంటికి కోడలు అయి ఇంత బాధ్యతగా ఉన్నది అని మురిసిపోతుంది అనసూయ. అయినా అక్కడ ఏదో తేడా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ అత్తయ్య సరిగ్గా చూసుకోవడం లేదేమో అని  నాకు భయంగా ఉన్నది అంటుంది అనసూయ. అలా ఎందుకు అనుకుంటారు,అత్తింటికి వెళ్లిన తర్వాత ఇలాంటివి తప్పవు. మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత అక్కడ ఉన్న వాళ్లందరి  దగ్గర అలవాటైపోతుంది  అంటుంది తులసి. 

అప్పుడు నందు మనసులో వీళ్ళకి అర్థం కావడం లేదా లేకపోతే నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? అక్కడ తప్పు జరుగుతుంది, దివ్యకి అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుందని ఆలోచిస్తూ ఒక బండిని గుద్దేయబోతూ తప్పించుకుంటాడు. జాగ్రత్తగా నడపరా అని వెనకనుంచి పరంధామయ్య అనగా సరే అని మళ్లీ బయలుదేరుతారు నందు వాళ్లు. మరోవైపు ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు కొంపతీసి అక్కడ ఏవైనా గొడవ జరిగిందా? అని మనసులో అనుకుంటుంది లాస్య. ఇంతలో వాళ్ళందరూ ఇంటికి వస్తారు. వస్తూనే కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాయి అంటాడు నందు. ఏమైంది వాళ్ళు ఏమైనా అన్నారా అని అడుగుతుంది లాస్య.

  వాళ్ళు అన్నారని అనుమానమా లేకపోతే వాళ్లు ఏమైనా అనాలని కోరుకుంటున్నావా అని అనసూయ అంటుంది. ఎందుకు అందరూ ప్రతి విషయాన్ని వెటకారంగా చూస్తున్నారు, నన్ను పరాయిదాన్ని చేస్తున్నారు. ఈ పెళ్లి కుదిర్చింది నేనే, ఇంకా నన్ను నమ్మడం లేదు అని కోపంగాక నుంచి వెళ్ళిపోతుంది లాస్య. ఆ తర్వాత సీన్లో దివ్య, రాజ్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఇంట్లో ఊసిపోవడం లేదు హాస్పిటల్ కి వెళ్లి డ్యూటీలో జాయిన్ అవుతాను అంటుంది.

కాళ్ళ మీద పారాణి ఆరకముందే గడప దాటడం ఏంటి, 16 రోజుల పండగ అయిన తర్వాతే బయటికి వెళ్లాలి. ఇంకా పెళ్లి ముచ్చట్లు కూడా ఏం మాట్లాడుకోలేదు కదా నా కళ్ళ ముందు నువ్వు తిరుగుతుంటే లక్ష్మీదేవిలా ఉంటుంది అని అంటుంది రాజ్యలక్ష్మి. తరువాయి భాగంలో లాస్య హాస్పిటల్ కి వెళుతూ ఉండగా తులసి,రాములమ్మ  చూసి ఆమెని ఫాలో అవుతారు. అప్పుడు రాజ్యలక్ష్మి, లాస్యకు డబ్బులు ఇవ్వడాన్ని చూసి షాకవుతారు తులసి, రాములమ్మ.

click me!