SSMB 29లో ఆఫర్, రాజమౌళికి నో చెప్పిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా ?

Published : Jun 09, 2025, 07:12 AM IST

ఎస్‌ఎస్‌ఎంబీ29లో రాజమౌళి ఓ కీలక పాత్రని తమిళ స్టార్ హీరోకి ఆఫర్ చేశారట. కానీ ఆ హీరో సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

PREV
15
SSMB 29 మూవీ

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ షూటింగ్ మొదలై కొంత భాగం పూర్తయింది. అయినప్పటికీ రాజమౌళి ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక కొనసాగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, తమిళ స్టార్ విక్రమ్ ని ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి సంప్రదించినట్లు తెలుస్తోంది. 

25
విక్రమ్ ని కలిసిన రాజమౌళి

చెన్నై నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, రాజమౌళి, విక్రమ్ మధ్య ఇటీవల ఓ సమావేశం జరిగిందట. రాజమౌళి, మహేష్ బాబు చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కీలకమైన నెగిటివ్ పాత్ర ఒకటుందని, దాని కోసం రాజమౌళి విక్రమ్ ని సంప్రదించారట. 

35
ఆఫర్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో

అయితే రాజమౌళి ఆఫర్ ని విక్రమ్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కెరీర్ కీలక దశలో ఉన్న తరుణంలో నెగిటివ్ పాత్రలు చేయకూడదనే నిర్ణయంతో విక్రమ్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. రాజమౌళి, విక్రమ్ మధ్య చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో ముగిసినట్లు సమాచారం. విక్రమ్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినప్పటికీ ఇద్దరూ ఒకరిపై ఒకరు పరస్పర గౌరవం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

45
మహేష్, రాజమౌళి మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్

ఇదిలా ఉండగా ఇప్పటికే మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ఓ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. అయితే రాజమౌళి ఆ వివరాలని ఇంతవరకు అధికారికంగా వెల్లడించలేదు. 

55
SSMB 29 లో మాధవన్ కూడా..

మరోవైపు మరో తమిళ స్టార్ మాధవన్ తో కూడా కీలక పాత్ర కోసం రాజమౌళి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాధవన్ చివరగా కేసరి 2 చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. మహేష్, రాజమౌళి చిత్రం దాదాపు 1000 కోట్ల బడ్జెట్ లో రూపొందుతోంది. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చే అంశం ఆధారంగా ఈ చిత్ర కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్. 

Read more Photos on
click me!

Recommended Stories