బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు.. జీవితాంతం వెంటాడే బాధ, అసలేం జరిగింది ?

Published : Jun 08, 2025, 03:12 PM IST

ప్రతి వేదికపై బాలయ్య తన తండ్రే తనకి ఆదర్శమని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే తన తండ్రి విషయంలో బాలయ్యకి ఓ బాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది అట.  

PREV
15
నందమూరి బాలకృష్ణ 

నందమూరి బాలకృష్ణ 1974లో తాతమ్మకల చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వయంగా బాలయ్యని చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. నటుడిగా బాలయ్య ఎదుగుదలలో ఎన్టీఆర్ పాత్ర ఎంతైనా ఉంది. ఆ తర్వాత కాలంలో బాలయ్య టాలీవుడ్ లో అగ్ర నటుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే.

25
బాలయ్య పెళ్ళికి దూరంగా ఎన్టీఆర్

అందుకే ప్రతి వేదికపై బాలయ్య తన తండ్రే తనకి ఆదర్శమని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే తన తండ్రి విషయంలో బాలయ్యకి ఓ బాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది. దాని గురించి బాలయ్య ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. బాలకృష్ణ పెళ్ళికి నందమూరి తారక రామారావు హాజరు కాలేదనే సంగతి తెలుసా? ఇది నిజం.. బాలయ్య పెళ్లికి ఎన్టీఆర్ హాజరు కాలేదు. కొడుకు పెళ్లికి తండ్రి హాజరు కాలేకపోవడం నిజంగా బాధని కలిగించే అంశమే.

35
జీవితాంతం వెంటాడే బాధ 

దీని గురించి బాలయ్య మాట్లాడుతూ ఆ విషయంలో లోటు నాకు ఎప్పటికీ ఉంటుంది. కానీ నా పెళ్ళికి హాజరు కాకుండా నాన్నగారు ఆ రోజు ప్రజలకు దగ్గరగా ఉన్నారు. అది సంతృప్తినిచ్చే విషయం అని బాలయ్య తెలిపారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాల్సి వచ్చింది. అందువల్ల ఎన్టీఆర్ బాలయ్య పెళ్లికి హాజరు కాలేకపోయారు.

45
రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాలేదు 

నాన్నగారు తన చిత్రాల్లో పనిచేసే సిబ్బంది పెళ్లిళ్లకు కూడా హాజరై పెద్ద మనిషిలా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. నాన్నగారు పార్టీ స్థాపించినప్పుడు తాను రాజకీయాల్లో అంతగా ఇన్వాల్వ్ కాలేదని బాలయ్య తెలిపారు. అవసరమైనప్పుడు మాత్రమే ప్రచారానికి వెళ్లేవాడిని అని అన్నారు.

55
అది నాన్నగారి నిర్ణయమే

పార్టీ స్థాపించాలనేది నాన్నగారి సొంత నిర్ణయం. ఆ వయసులో రాజకీయాల్లోకి వెళ్లి రిస్క్ చేయడం ఎందుకు అని ఎన్టీఆర్ గురించి కుటుంబ సభ్యులు ఎప్పుడైనా భావించారా అని యాంకర్ అడిగారు. బాలయ్య సమాధానం ఇస్తూ నాన్నగారికి వయసుతో సంబంధం లేదు. అనుకున్నది చేసి తీరుతారు అని బాలయ్య అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories