అఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తారల సందడి..హాజరైన మహేష్, రాంచరణ్, యష్ ఇంకా ఎవరెవరంటే

Published : Jun 08, 2025, 09:08 PM ISTUpdated : Jun 08, 2025, 09:17 PM IST

ఆదివారం రోజు ఘనంగా అఖిల్, జైనబ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు.

PREV
19

అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్‌డ్జీ శుక్రవారం, జూన్ 6న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. జైనబ్ తండ్రి జుల్ఫీ వేల కోట్ల ఆస్తులు ఉన్న పారిశ్రామికవేత్త. బిజినెస్ వ్యవహారాల్లో ఆయనకి నాగార్జునతో పరిచయాలు ఉన్నాయట. ఆ విధంగా కూడా ఇరు కుటుంబాల మధ్య సంబంధం ఏర్పడింది. 

29

కాగా ఆదివారం రోజు ఘనంగా అఖిల్, జైనబ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేసింది.

39

మహేష్ బాబు, నమ్రత, సితార కలసి కొత్త జంటతో దిగిన ఫోటో వైరల్ గా మారింది. అదే విధంగా అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో అక్కినేని ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో దిగింది. 

49

ఈ గ్రూప్ ఫోటోలో అఖిల్, నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత, నాగార్జున సోదరుడు వెంకట్ ఫ్యామిలీ, సోదరు నాగ సుశీల, సుశాంత్, సుప్రియ, సుమంత్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 

 ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో అఖిల్ వెస్ట్రన్ స్టైల్ లో వైట్ సూట్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక జైనబ్ క్రీమ్ కలర్ లాంగ్ గౌన్ ధరించి మెరిసిపోతోంది.  

అదే విధంగా తమిళ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలసి అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యారు. 

59

అఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ కి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. 

69

అఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

79

అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో రాకింగ్ స్టార్ యష్ సందడి చేశారు.  

89

అఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలసి హాజరయ్యారు.  

99

అఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ సందడి చేశారు. అదే విధంగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కూడా కనిపించారు.

Read more Photos on
click me!

Recommended Stories