తెలుగు సినిమా రంగంలో లేడీ అమితాబ్ గా ఇమేజ్ పొందిన ప్రముఖ నటి విజయశాంతి. ఆమె సినీ ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన ఆమె, తన అందం, నటనతో తెలుగు, తమిళం, హిందీ భాషలలో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
విజయశాంతి 1980లో తమిళ చిత్రం కల్లుక్కల్ తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సమయంలో ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. తొలి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు పొందిన ఆమె, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆమె రికార్డు స్థాయిలో అవకాశాలు అందుకున్నారు.