Jr NTR and Kalyan Ram: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో. నందమూరి వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా.. తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.
నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా. . తారక్ అంత సక్సెస్ అవ్వలేకపోయారనే చెప్పాలి. ఎన్టీఆర్ తరువాత వారి ప్యామిలీలో హీరోగా కళ్యాణ్ రామ్ కాస్త రాణిస్తున్నాడు. స్టార్ హీరో స్టేటస్ లేకపోయినా.. మంచి మంచి సినిమాలతో నందమూరిఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.
Aloso Read: 1500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత. పాన్ ఇండియా హీరోల జంటగా స్టార్ హీరోయిన్
Jr NTR, Kalyan Ram
హీరోగా కంటే నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఎక్కువ సక్సెస్ లు అందుకున్నాడు. ఎన్టీఆర్ సినిమాలను తన సొంత బ్యానర్ పై నిర్మిస్తూ వస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ ఇద్దరు అన్నామ్ములు ఎంతో ప్రేమగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు. సినిమా ఈవెంట్స్ లో కూడా కలిసి కనిపిస్తుంటారు.
ఇక కళ్యాణ్ రామ్ సినిమా ఏది వచ్చినా.. ఆసినిమా ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ వెళ్తారు. ఇక తాజాగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
Aloso Read: రజినీకాంత్ చేతుల్లో దెబ్బలు తిన్న నాగార్జున, ట్విస్ట్ ఏంటంటే?
ఇక ఈసినిమాలో కల్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి నటించారు. కాగా విజయశాంతి ప్రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ..ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గొప్పతనం గురించి మాట్లాడారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు రామ లక్ష్మణుల్లా ఉంటారని. ఇద్దరిని నందమూరి అభిమానులు గుండెల్లో పెట్టుకునిచూసుకుంటున్నారన్నారు.
కళ్యాణ్ రామ్ షూటింగ్ లో ఎక్కవగా జూనియర్ ఎన్టీఆర్ గురించేమాట్లాడేవారని. తమ్ముడు కమిట్మెంట్ తో పనిచేశాడు. చాలా కష్టపడతాడని ఆయన అంటుండేవారని విజయశాంతి అన్నారు. ఎన్టీఆర్ కూడా తన టాలెంట్ తో, డాన్స్ తో ఈ స్తాయికి వచ్చారు. పాన్ ఇండియా హీరోగా మారాడు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారంటూ విజయశాంతి కామెంట్స్ చేశారు. విజయశాంతి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.