టీవీ షోలో లాఠీ తిప్పిన విజయశాంతి, మీసం మెలేసిన కళ్యాణ్ రామ్

Published : Mar 19, 2025, 09:15 PM IST

Vijayashanti and Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
14
టీవీ షోలో లాఠీ తిప్పిన విజయశాంతి, మీసం మెలేసిన కళ్యాణ్ రామ్
Vijayashanti, Kalyan Ram

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

24
Vijayashanti, Kalyan ram

విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీ కొడుకులుగా నటిస్తున్నారు. కథలో ఒక సందర్భం నుంచి వీరిద్దరూ శత్రువులుగా మారబోతున్నట్లు టీజర్ లో చూపించారు. దీనితో కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య పోటాపోటీ సన్నివేశాలు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠ నెలకొంది. త్వరలో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండడంతో ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. 

34
Vijayashanti, Kalyan ram

తాజాగా కళ్యాణ్ రామ్, విజయశాంతి ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుల్లితెరపై ఉగాది స్పెషల్ ప్రోగ్రాం కి హాజరయ్యారు. ఇండియన్ సినిమా లేడీ సూపర్ స్టార్ అంటూ విజయశాంతికి ఈ ప్రోగ్రాంలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. కళ్యాణ్ రామ్, విజయశాంతి కలసి ఈ షోకి హాజరయ్యారు. 

44
Vijayashanti, Kalyan ram

విజయశాంతి తన స్టైల్ లో లాఠీ పట్టుకుని తిప్పడం హైలైట్. ఇక కళ్యాణ్ రామ్ అయితే మీసం మెలేస్తూ కనిపిస్తున్నాడు. అభిమానులకు ఈ చిత్రం పండగలా ఉంటుంది అని విజయశాంతి తెలిపారు. 

 

click me!

Recommended Stories