ఈ క్రమంలో నితిన్ చాలా ఏళ్ళ క్రితం నటించిన ఒక మూవీలోని ఐటెం సాంగ్ చర్చనీయాంశంగా మారింది. నితిన్ పదేళ్ళపాటు వరుస ఫ్లాపులు ఎదుర్కొని ఇక సినిమాలకు దూరం అవుదాం అని అనుకుంటున్నాడు. ఆ టైంలో ఇష్క్ చిత్రం నితిన్ కెరీర్ ని నిలబెట్టింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నితిన్ కి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం పడింది. ఆ మూవీ గుండె జారి గల్లంతయ్యిందే. ఈ చిత్రంలో నితిన్, నిత్యమీనన్ మధ్య కెమిస్ట్రీ, కన్ఫ్యూజన్ డ్రామా అదిరిపోయాయి.