కృష్ణలో విజయనిర్మలకు నచ్చని విషయం ఏంటో తెలుసా..? సాయంత్రం అయితే అదే పనంట..

First Published | Nov 23, 2024, 7:41 PM IST

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ పాలిట దేవుడు.. నిర్మాతల పాలిట ఆపద్భాందవుడు... అయితే ఆయనలో కూడా కొన్ని నచ్చని విషయాలు ఉన్నాయట. అది కూడా కృష్ణ దర్మపత్ని విజయనిర్మలకు సూపర్ స్టార్ విషయంలో కొన్ని విషయాలు నచ్చవట. ఇంతకీ ఏంటా విషయాలు. 

సూపర్ స్టార్ కృష్ణ.. మన టాలీవుడ్ లోనే కాదు.. ఓవర్ ఆల్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం చూసుకున్నా.. కృష్ణ లాంటి వ్యక్తి మరొకరు ఉండరని చెప్పాలి. సినిమాలకు సబంధించిన కృష్ణ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశారు. అవి ఇక ఎవరికి సాధ్యం కావు కూడా. ఫస్ట్ కలర్ సినిమా, ఫస్ట్ కౌబాయ్ సినిమా, ఒక ఏడాది అయితే 15 సినిమాలు చేసి ఎవరూ అందుకోలేని మరో ఘనతను కూడా సాధించారు కృష
 

డూప్ లేకుండా ఫైట్లు చేయడం.. హీరోయన్లకు కంఫర్ట్ జోన్ ఇవ్వడంలో కృష్ణ తరువాతే ఎవరైనా. అంతే  కాదు... ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఎన్ని సినిమాలకు డబ్బులు తీసుకోలేదో లెక్కే ఉండదు. కొన్ని సినిమాలు చెక్కులు వచ్చినా.. అవి బౌన్స్ అయ్యేవట. కాని కృష్ణ మాత్రం పట్టించుకునేవారు కాదట. 


ఇక తన సినిమా వల్ల ఎవరైనా నిర్మాత నష్టపోతే.. పిలిచి మరీ డేట్స్ ఇచ్చి.. డబ్బులు ఫైనాన్స్ కు ఇప్పించి.. తాను కూడా ఫ్రీగానటించేవాడట. అలా సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎన్ని చెప్పుకున్న తక్కువే. రెస్ట్ లెస్ గా సినిమాలు చేసేవారు. రోజుకు మూడు షిప్ట్ లు పనిచేసిన ఏకైక హీరో కృష్ణ. 

Indira Devi

అందుకే కాబోలు.. ఆయన కష్టాన్ని చూసిన మహేష్ బాబు మాత్రం ఏడాదికి ఒక్క సినిమానే చేస్తూ...మిగతా టైమ్ ను తనఫ్యామిలీకి కేటాయించేశాడు. ఇక కృష్ణ విషయానికి వస్తే.. ఆయన హీరోయిన్ విజయనిర్మలను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. చివరి వరకూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ఈ జంట. 
 

ఇక కృష్ణలో తనకు నచ్చని విషయం ఒకటి ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు విజయనిర్మల. అదేంటంటే..త్వరగా ఇంటికి వచ్చేవారు కాదట. షూటింగ్ అయిపోతే  7 గంటలకు ఇంటికి రావాలు.. కాని ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే.. మాట్లాడుకుంటూ టైమ తెలియకుండా గడిపేవారట. 
 

ఇంటిదగ్గర తాను ఎదరు చూస్తున్నాను అని అనుకునేవారు కాదట. మరీముఖ్యంగా నటుడు ప్రభాకర్ రెడ్డి లాంటివారితో కృష్ణ స్నేహం చేసేవారట. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు విజయనిర్మల. ఆ విషయంలో విజయనిర్మల గొడవ కూడా పెట్టుకునేవారట. రాగానే కోప్పడే వారట. 

Latest Videos

click me!