పాన్ ఇండియా హీరోలను శాసించే రాజమౌళిని భయపెట్టిన ఒకే ఒక హీరో, అందుకే దూరం పెట్టాడా! 

First Published | Nov 23, 2024, 6:43 PM IST

రాజమౌళి చిటికేస్తే ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ క్యూ కడతారు. పాన్ ఇండియా స్టార్స్ ని కూడా ఆయన శాసిస్తాడు. అలాంటి రాజమౌళికి ఒక హీరో అంటే చాలా భయం అట. 
 

Rajamouli

రాజమౌళి సినిమాకు తానే కర్త, కర్మ, క్రియ. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆయన మాట వినాలి. సినిమా రెండేళ్లు పట్టినా.. మూడేళ్లు పట్టినా మరో మూవీ చేయకూడదు. గెటప్, సెటప్ మార్చకూడదు. స్టార్ హీరోల వెనక దర్శకులు పడటం పరిపాటి.. కానీ రాజమౌళితో సినిమా చేయాలని స్టార్ హీరోలు క్యూ కడతారు. ఆయన నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తారు. 

కారణం.. ఆయన అపజయం లేని దర్శకుడు. ఆయన సినిమాలతో ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్ వంటి హీరోల ఇమేజ్ మారిపోయింది. ప్రభాస్ ని బాహుబలితో పాన్ ఇండియా స్టార్ ని చేశాడు. ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అంతర్జాతీయ సినిమా వేదికలపై  కీర్తి దక్కేలా బాటలు వేశాడు. రాజమౌళితో సినిమా అంటే హిట్టా ఫ్లాపా? అనే చర్చ ఉండదు. కేవలం రికార్డుల గురించే మాట్లాడుకుంటారు. 
 


అందుకే హీరోలు ఆయన చెప్పినట్లు వింటారు. కేవలం హీరోనే కాదు.. నిర్మాత కూడా రాజమౌళి కనుసన్నల్లో పని చేయాలి. సినిమా తీశాము, మన బాధ్యత అయిపోయిందని రాజమౌళి రిలాక్స్ అవ్వరు. అక్కడి నుండి అసలు కథ మొదలుపెడతాడు. విపరీతంగా ప్రోమోట్ చేసి, భారీ బిజినెస్ జరిగేలా చూస్తాడు. ఇలా తన సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. 

అలాంటి రాజమౌళికి ఓ హీరో అంటే భయం అట. అందుకే ఒక్క సినిమా కూడా ఆయనతో చేయలేదట. సదరు హీరో ఎవరో కాదు... నందమూరి బాలకృష్ణ. గతంలో అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చిన రాజమౌళి ఈ విషయం తెలియజేశాడు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి తన మనసులో మాట బయటపెట్టాడు. 

ఇప్పటి వరకు మన కాంబినేషన్ పడలేదు. మా అభిమానులు రాజమౌళితో మూవీ ఎందుకు చేయలేదని అడిగారు. మీరు నన్ను హ్యాండిల్ చేయలేను అన్నారట... అని బాలకృష్ణ నేరుగా అడిగేశాడు. దానికి సమాధానంగా నిజానికి మీరంటే నాకు భయం. అందుకే అలా అన్నాను అని సమాధానం చెప్పాడు రాజమౌళి. మరి రాజమౌళి అంతగా భయపడటానికి కారణం ఏమిటో తెలియదు. 

బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు అనేకం. ఈ సంఘటనల నేపథ్యంలో రాజమౌళి బాలయ్యది దురుసు స్వభావం అనే అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు. కాగా సింహాద్రి కథను మొదట బాలయ్యకే రాజమౌళి వినిపించాడట. ఆయన రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ తో చేశాడనే ఓ వాదన ఉంది. సింహాద్రి రాజమౌళి రెండో చిత్రం. అందుకే బాలయ్యకు విశ్వాసం లేకపోయి ఉండొచ్చు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్. 

Latest Videos

click me!