భర్త 80 రోజులుగా జైల్లో మగ్గుతోంటే.. ఆ నటుడి భార్య ఏం చేసిందో చూడండి

First Published | Sep 10, 2024, 7:45 AM IST

కన్నడ నటుడు దర్శన్ అరెస్టు 80 రోజులుగా జైల్లో గడుపుతున్నారు. మరోవైపు ఆయన భార్య విజయలక్ష్మీ స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలో పాల్గొని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్  అరెస్టు అయి 80 రోజులు గడిచాయి. సోమవారం నాడు కోర్టు దర్శన్‌కు మరో మూడు రోజులు రిమాండ్‌ పొడిగించింది. ఈ కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన 3991 పేజీల చార్జ్‌షీట్‌ మీడియాకు అందుబాటులోకి వచ్చింది.
 

దర్శన్ పరిస్థితి ఇలా ఉండగా, ఆయన భార్య విజయలక్ష్మీ ప్రతి సందర్భంలో ఆయనకు తోడుగా ఉన్నారు. ఆమె బయటకు వెళ్లడం, బయట కనిపించడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ఆమె సడెన్‌గా స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలో కనిపించారు.
 


దర్శన్ పై చార్జ్‌షీట్‌ దాఖలు అయిన తర్వాత విజయలక్ష్మీ దర్శన్ కొంత రిలాక్స్‌ మూడ్‌లో ఉన్నట్టు కనిపించింది. దర్శన్ జైల్లో ఉన్నప్పటికీ, విజయలక్ష్మీ దర్శన్ ఫుల్‌ జోష్‌లో తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు.

తన స్నేహితురాలు శ్రుతి రమేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలో విజయలక్ష్మీ ఆనందంగా పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 

ఆమె తెల్ల బట్టలు వేసుకుని మాడర్న్‌ డ్రెస్‌లో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలో కనిపించారు. "విజీ, మీకు మంచి మనసుంది. మీరు మీ స్నేహితుల సంతోషం కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటారో నాకు తెలుసు. మీరొచ్చి నా పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చారు," అంటూ శ్రుతి రమేష్ ఆమెను ప్రశంసించారు.

Latest Videos

click me!