బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్మెంట్ రానున్నట్లు సమాచారం.
స్త్రీ 2 సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే భయపెడుతుంది కాబట్టి ఓటిటిలలోనూ బాగానే ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు.