సోనియా ఆకుల పూర్తిగా విష్ణుప్రియ మీద పర్సనల్ అటాక్ చేసిందని ఆడియన్స్ అభిప్రాయం. విష్ణుప్రియ జోక్స్, డ్రెస్సింగ్, ఫ్యామిలీ అంశాలను లేవనెత్తుతూ సోనియా ఆకుల విమర్శలు చేసింది. నువ్వు అడల్ట్ జోక్స్ వేస్తావు. బట్టలు సరిగా ధరించవు. నీ చేష్టలు అసభ్యకరంగా ఉంటాయి అనే అర్థంలో సోనియా ఆరోపణలు గుప్పించింది.
నీతో సన్నిహితంగా ఉండే వాళ్ళ మీద మాత్రమే నువ్వు జోక్స్ వేయవు. మిగతా అందరి మీద అడల్ట్ జోక్స్ వేస్తావు. బట్టలు ఎలా ధరించాలో నేర్చుకో. నీ పక్కన నిల్చొనే వ్యక్తి కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. నీ మైండ్ లో ఎప్పుడూ అడల్ట్రీ కంటెంట్ రన్ అవుతుందంటూ... విష్ణుప్రియని ఉద్దేశిస్తూ కఠినంగా సోనియా మాట్లాడింది.