'సెక్సువల్ పాఠాలు పార్టనర్ దగ్గరే నేర్చుకున్నాకే మగడినయ్యా'... తమన్నా బోయ్ ప్రెండ్ బోల్డ్ కామెంట్‌

Published : Jul 02, 2024, 06:35 AM IST

ఏ సినిమాల్లో కూడా చేయనట్లుగా  విజయ్‌ వర్మతో ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ సిరీస్‌లో  హాట్ సీన్స్ లో  నటించారు తమన్నా. 

PREV
111
  'సెక్సువల్  పాఠాలు పార్టనర్ దగ్గరే నేర్చుకున్నాకే మగడినయ్యా'... తమన్నా బోయ్ ప్రెండ్ బోల్డ్  కామెంట్‌


డిజిటల్ యుగంలో ఏదీ దాపరికం లేదు. అంతా ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. గతంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటానికి వెనకాడేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ అవుతుంది తమను తాము ప్రమోట్ చేసుకున్నట్లు అవుతుంది అని మీడియా ముందు కొన్ని అంతరంగిక విషయాలు కూడా చర్చిస్తున్నారు. అదే విధంగా తమన్నా బోయ్ ప్రెండ్ విజయ్ వర్మ సైతం రీసెంట్ గా తమ వెబ్ సీరిస్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. 

211
Tamannah Bhatia


తెలుగు,తమిళంలో ,హిందీ బాషల్లో  స్టార్ హీరోయిన్  గా వెలిగిన తమన్నా(Thamannaah) కు ఇప్పుడు ఆఫర్స్ తగ్గాయి. దాంతో తన రూట్ మార్చి వెబ్ సీరిస్ లతో బిజీ అయ్యింది. అడపదడపా సినిమాల్లో కనపడుతున్న ఆమె తో  విజయ్ వర్మ(Vijay Varma)..ప్రేమాయణం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ టైంలోనే  ప్రేమలో పడ్డారు.  ఈ లవ్బర్డ్స్ త్వరలో పెళ్ళికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి.

311
Vijay varma


తమన్నా చాలా సందర్భాల్లో..తన ప్రియుడు గురుంచి మాట్లాడుతూ..విజయ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకేం కావాలో తనకు బాగా తెల్సు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు అండగా ఉంటాడనే నమ్మకం నాకుంది" అంటూ విజయ్ ను తెగ పొగిడేస్తూ చెప్తూ వచ్చింది.  ఆ మధ్యన తమన్నా-విజయ్ వర్మ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..వీళ్ల ప్రేమ వ్యవహారం బయటపడింది.

411
Vijay Varma


 ఏ సినిమాల్లో కూడా చేయనట్లుగా  విజయ్‌ వర్మతో ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ సిరీస్‌లో  హాట్ సీన్స్ లో  నటించారు తమన్నా. ఆ సిరీస్‌లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమోననే అభిప్రాయం పలువురికి కలగజేసింది. అయితే అప్పుడు కాదు.. అసలు డేటింగ్‌ మొదలైంది ఎప్పుడంటే అంటూ  ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు విజయ్‌ వర్మ.
 

511
Vijay Varma Tamannaah Bhatia


ఆ ఇంటర్వ్యూలో విజయ్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ అప్పుడు మేం డేటింగ్‌లో లేము.ఆ షూటింగ్‌ మొత్తం పూర్తయ్యాక ‘ర్యాప్‌అప్‌ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో తమన్నా, నేను, మరో ఇద్దరు పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలోనే ‘నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అంటూ నా ఫీలింగ్‌ని తమన్నాతో చెప్పాను. ఆ తర్వాత మా ఫస్ట్‌ డేట్‌ సెట్‌ కావడానికి 20, 25 రోజులు పట్టింది’’ అని పేర్కొన్నారు. 

611
Image: Instagram

ఇది ప్రక్కన పెడితే రీసెంట్ గా విజయ్ వర్మ నటించిన మీర్జాపూర్ 3 వెబ్ సీరిస్ రిలీజ్ కాబోతోంది.  ఆ సీరిస్ ప్రమోషన్స్ లో చాలా విషయాలు మాట్లాడారు. అదే సందర్బంలో ..మనం మన పార్టనర్స్ నుంచి చాలా వరకూ నేర్చుకుంటాము. ముఖ్యంగా సెక్సవల్ గా ప్రతీది మనకి మనమే తెలుసుకోలేము. డిస్కవర్ చేయలేము. మీరు సరైన ఎనర్జీ ఉన్న పార్టనర్ ని కలిసినప్పుడు మీరు అబ్బాయి నుంచి మగవాడు గా మారతారు అంటూ చెప్పుకొచ్చారు. ఇది విన్న చాలా మంది ఇంతకీ నీ పార్టనర్ ఎవరు ..మీ లవర్ తమన్నానా..ఆమె నుంచి ఏం నేర్చుకున్నావ్ అంటూ సోషల్ మీడియాలో చిన్న సైజు సరదా ర్యాగింగ్ చేస్తున్నారు.

711

బ్ సీరిస్ లలో కానీ సినిమాల్లో వచ్చే ఇంటిమేట్ సీన్స్ కు తాము ఎలా కష్టపడతామో చెప్తూ...ఇది ఫైట్స్, డాన్స్ ప్రాక్టీస్ లాంటిదే. వీటికి వర్క్ షాప్ కూడా నడుస్తుంది. వీటిలో టిప్స్ చెప్తారు. వాటిని మేము ఫాలో అవుతాము. దాంతో షూట్ చేసేటప్పుడు చాలా స్పీడుగా వర్క్ ఫినిష్ అవుతుంది. లేకపోతే సెట్స్ పై సిగ్గుపడుతూ, మొహమాటపడుతూ కూర్చోవటమే సరిపోతుంది అని తేల్చి చెప్పారు. 

811
tamannaah confirms her relatioship with vijay varma nsn


‘మీర్జాపూర్ 3’ సెట్‌లో శ్వేతా త్రిపాఠితో తన రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఒక కో ఆర్డినేటర్ కూడా అక్కడ ఉన్నారని రివీల్ చేశాడు. ముందు రెండు సీజన్స్‌లో అలాంటిది ఎప్పుడూ జరగలేదని అన్నాడు. ‘‘కో ఆర్డినేటర్ ఉండడం అనేది చాలా అవసరంగా మారింది. వారి ట్రైనింగ్ వల్లే ఆ సీన్ షూటింగ్ అప్పుడు ఒక సేఫ్ వాతావరణం క్రియేట్ అయ్యింది’’ అని తెలిపాడు విజయ్ వర్మ.

911


కో ఆర్డినేటర్ చెప్పిన కొన్ని సలహాలు, చిట్కాలు తమకు చాలా సహాయపడ్డాయని చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ. మామూలుగా రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు సెట్ అంతా ఒకరకమైన టెన్షన్‌తో ఉంటుందని కానీ కో ఆర్డినేటర్ ఉండి, ఆ సీన్స్‌ను కొరియోగ్రాఫీ చేయడం వల్ల అంతా సులువుగా అయిపోయిందన్నాడు. అందులో చాలా టెక్నికల్ వివరాలు కూడా ఉంటాయన్నాడు.
 

1011

విజయ్ వర్మ బాలీవుడ్ నటుడిగానే చాలా మందికి తెల్సు.. కానీ అతను ఒక తెలుగువాడు, అందులోనూ తెలంగాణాకు చెందిన వ్యక్తి అని చాలా మందికి తెలియదు. విజయ్ వర్మ 1986 మార్చ్ 29న హైదరాబాద్ లో జన్మించాడు. విజయ్ తండ్రి హ్యాండీ క్రాఫ్ట్ బిజినెస్ చేసేవారు, తల్లి హౌజ్ వైఫ్. అతనికి ఇద్దరు అన్నయ్యలు. 
 

1111
vijay varma


దేశవ్యాప్తంగా  సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ లిస్ట్‌లో ‘మీర్జాపూర్’ కూడా ఒకటి. అందుకే ఈ సిరీస్ రెండు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసుకొని మూడో సీజన్‌లోకి అడుగుపెట్టింది. 2024 జులై 5న ‘మీర్జాపూర్ 3’ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. శ్వేతా త్రిపాఠి.. ‘మీర్జాపూర్’ మొదటి సీజన్ నుండి గోలూ పాత్రలో అలరిస్తోంది. ఇక విజయ్ వర్మ చోటే త్యాగిగా రెండో సీజన్‌లో ఎంటర్ అయ్యాడు. 

click me!

Recommended Stories