సమంతకి పెళ్లైపోయింది కదా, ఆమె వద్దు అని అన్నారు.. చిరంజీవి సమాధానం విని..

Published : Jul 01, 2024, 07:57 PM IST

ఒక చిత్రాన్ని అంచనా వేయడంలో చిరంజీవి శైలి విభిన్నంగా ఉంటుంది. అందుకే ఆయన సక్సెస్ ఫుల్ మాస్ హీరోగా ఎక్కువ కాలం రాణిస్తున్నారు. కథల ఎంపిక విషయంలో చిరంజీవిని చూసి నేర్చుకోవాలని చాలా మంది సెలెబ్రిటీలు అంటుంటారు.

PREV
16
సమంతకి పెళ్లైపోయింది కదా, ఆమె వద్దు అని అన్నారు.. చిరంజీవి సమాధానం విని..

ఒక చిత్రాన్ని అంచనా వేయడంలో చిరంజీవి శైలి విభిన్నంగా ఉంటుంది. అందుకే ఆయన సక్సెస్ ఫుల్ మాస్ హీరోగా ఎక్కువ కాలం రాణిస్తున్నారు. కథల ఎంపిక విషయంలో చిరంజీవిని చూసి నేర్చుకోవాలని చాలా మంది సెలెబ్రిటీలు అంటుంటారు. చిరంజీవి నిర్ణయాలు కూడా కొన్ని తప్పి ఉండొచ్చు. కానీ ఆ కథ స్వభావం ఏంటి.. ఏ హీరోకి సెట్ అవుతుంది అని అంచనా వేయడంలో చిరు స్టయిలే వేరు. 

26

దిల్ రాజు జోష్ కథని రాంచరణ్ తో చేయాలి అంటే.. వద్దు ఇది ఆడదు అని రిజెక్ట్ చేశారు. రాంచరణ్ చెవిటివాడిగా నటించాలి అని సుకుమార్ అంటే అద్భుతమైన కథ అవుతుంది అని ప్రోత్సహించారు. సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. 

36

డైరెక్టర్ సుకుమార్ కి ఉత్తమ దర్శకుడిగా ఈ చిత్రానికి సైమా అవార్డు దక్కింది. ఈ అవార్డుని సుకుమార్ అల్లు అరవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆ సమయంలో సుకుమార్ కొన్ని క్రేజీ కామెంట్స్ చేశారు. ఈ అవార్డు చిరంజీవి గారికి కూడా దక్కుతుంది. ఎందుకంటే నేను దర్శకుడిగా కంటే.. చిన్నప్పుడు చిరంజీవి గారి ఫోటోలు 5 పైసలకి అమ్ముకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇదంతా ఆయన ఇచ్చిన ఇన్సిపిరేషన్. 

46

చిరంజీవి గారి ఆలోచనా విధానం కథల విషయంలో ట్రెండ్ కి తగ్గట్లుగా మారిపోతూ ఉంటుంది. ఈ చిత్ర హీరోయిన్ సమంతని తీసుకుందామా లేదా అనే డిస్కషన్ జరిగింది. చిత్ర యూనిట్ లో చాలా మంది ఆమెకి పెళ్లయిపోయింది కదా వద్దు అని అన్నారు. అది విని చిరంజీవి గారు పెళ్ళైతే ఏంటి.. ఆమె అద్భుతమైన నటి.. సమంతనే ఫిక్స్ చేయండి. 

56
Chiranjeevi

సమంత బాగా నటిస్తుందా లేదా అని మాత్రమే ఆడియన్స్ చూస్తారు కానీ పెళ్లయిందా లేదా అని చూడరు అని చిరు సమాధానం ఇచ్చారు అని సుక్కు తెలిపారు.కథ వినేటప్పుడు ఈ చిత్రంలో రాంచరణ్ చెవిటివాడిగా నటించాలి అని చెప్పాను. నో ప్రాబ్లెమ్ అలాగే కానివ్వు అని అన్నారు. 

66

సినిమా మొత్తం పూర్తయ్యాక ఆయన చూశారు. సినిమా లెన్త్ దాదాపు 3 గంటలు ఉంది ఏం చేయమంటారు అని అడిగా.. ఒక్క ప్రేము కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే రిలీజ్ చేసేయండి అని చెప్పారు. ఈ సక్సెస్ లో చిరంజీవి గారి క్రెడిట్ కూడా ఉందని సుకుమార్ అన్నారు. 

click me!

Recommended Stories