సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెని.. కృష్ణంరాజు దత్తత తీసుకోవాలనుకున్నారా, ఆయన ఓపెన్ గా చెప్పిన సీక్రెట్స్ ఇవే

First Published Jul 1, 2024, 9:38 PM IST

సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. 1960లో కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1966లో కృష్ణం రాజు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలసి కొన్ని చిత్రాల్లో కూడా నటించారు.

సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. 1960లో కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1966లో కృష్ణం రాజు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలసి కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న కృష్ణ, కృష్ణంరాజు ఒకరితో ఒకరికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

ముఖ్యంగా కృష్ణంరాజు కొన్ని ఆసక్తికర విషయాలని రివీల్ చేశారు. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కృష్ణ నాకు మంచి మిత్రుడు. మంచి మనసుతో పాటు  పౌరుషం కూడా ఉన్న వ్యక్తి కృష్ణ అని కృష్ణం రాజు అన్నారు. వాస్తవానికి నేను రెబల్ స్టార్ కాదు. ఆయనే రెబల్ ప్రొడ్యూసర్ అని కృష్ణంరాజు కితాబిచ్చారు. 

అల్లూరి సీతారామరాజు సినిమా తీసి ఇది తెలుగు చిత్ర పరిశ్రమ పొటెన్షియల్ అని నిరూపించిన వ్యక్తి కృష్ణ అని కృష్ణంరాజు కొనియాడారు. అదే విధంగా సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ చేసిన సాహసాలు, సాధించిన ఘనతల గురించి కూడా కృష్ణంరాజు తెలిపారు. అదే వేదికపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. 

కృష్ణకి, నాకు ఉన్న అనుభందం చాలా గొప్పది.. ఎంత అంటే.. కృష్ణ గారి ఆఖరి కుమార్తెని నేను దత్తత తీసుకుంటా అని అడిగా. సరే అని అన్నాడు అంటూ కృష్ణం రాజు నవ్వుతూ తెలిపారు. మహేష్ బాబుతో నేను బాబీ సినిమా చేస్తానని అడిగా.. అందుకు కూడా సరే అని అన్నారు. 

krishna,krishnam raju

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటారు. కృష్ణ గారి విజయం వెనుక ఉన్న మహిళ విజయ నిర్మలగారు. నాకు నా భార్య శ్యామల అని కృష్ణంరాజు తెలిపారు. కృష్ణ కొన్ని సందర్భాల్లో ఏడాదికి 14 సినిమాలు కూడా చేశారు. కృష్ణ నా పక్కన ఉన్నప్పుడు ఒక వ్యక్తి.. ఇన్నేసి సినిమాలు చేస్తున్నారు.. అలసట అనిపించిందా అని అడిగారు. 

దీనికి కృష్ణ గారు ఇచ్చిన సమాధానం.. ఆ అలసట వల్ల దాదాపు 120 కుటుంబాలకు ఉపాధి దొరుకుతోంది కదా.. కాబట్టి నాకు అలసట లేదు అని చెప్పారు. ఆ మాట విని తాను షాక్ అయినట్లు కృష్ణంరాజు తెలిపారు. తాము కూడా ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేశాం. కానీ కృష్ణ గారిలా ఎప్పుడూ చేయలేదు అని అన్నారు. కృష్ణ గారి సినిమాల వల్ల వందల కుటుంబాలకు ఒకేసారి ఉపాధి దొరికేది అని కృష్ణం రాజు గుర్తు చేశారు. 

Latest Videos

click me!