చివరి సినిమాకు విజయ్ దళపతి డబుల్ సెంచరీ, రికార్డ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో

First Published | Feb 16, 2024, 2:35 PM IST

సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్న నటుడు విజయ్ తను చివరిసారి చేయబోయే సినిమాకు రెమ్యూనరేషన్ గట్టిగా తీసకోబోతున్నాడట. ఈ పారితోషికంతో.. ఓ భారీ బడ్జెట్ సినిమా చేయొచ్చు అంటున్నారు సినీజనాలు. 

తమిళ స్టార్ హీరో.. పొలిటికల్ ఎంట్రీతో సంచలనం సృష్టించిన నటుడు దళపతి విజయ్.  తమిళ  ఫిల్మ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తరువాత తిరుగులేని స్టార్ గా వెలుగు వెలుగుతున్నఆయన.. సినిమాలకు త్వరలో గుడ్ బై చెప్పి రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాడు.

ప్రస్తుతం  విజయ్ గోట్ సినిమాలో నటిస్తున్నాడు.  వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో  ఏజీఎస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, నితిన్ సత్య, వైభవ్ నటిస్తున్నారు. 


Thalapathy Vijay

ఇక ఇళయరాజ తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతోంది. దాదాపు చిరవిదశకు షూటింగ్ పనులు వచ్చాయి. కొన్ని వారాల క్రితం, నటుడు విజయ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించాడు. అందుకు తగ్గట్టుగానే తాను తమిళనాడు వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించానని, 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. 
 

మరో షాకింగ్  విషయాన్ని ఆయన ఈ సందర్భంగా వెల్లడించాడు.  అదేంటంటే.. తాను కమిట్ అయిన తలపతి 69 తర్వాత సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.దళపతి 69 తర్వాత విజయ్ సినిమాలో నటించడం లేదనే వార్త ఆయన అభిమానులకు షాక్ ఇచ్చింది. విజయ్ అభిమానులు ఈ వార్త విని ఎంతో బాధపడ్డారు. 

మరోవైపు, అతని చివరి సినిమా అయిన దళపతి 69కి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.  టాలీవుడ్ ఫేమస్ దర్శకుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తాడని సమాచారం. దాదాపు త్రివిక్రమ్ తో సినిమా కన్ ఫార్మ్ అయినట్టు సమాచారం. 

ఇక ప్రస్తుతం మరో న్యూస్ వైరల్ అవుతోంది..  దళపతి విజయ్ తన  69 వ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం ఈసినిమాకు విజయ్ కు 200 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట. 

ఇక ఇది విజయ్ కెరీర్‌లో అత్యధిక పారితోషికం. ఎలాగో సినిమాలు వదిలేయబోతున్న విజయ్.. ఈ రేంజ్ లో డిమాండ్ చేసి.. రికార్డ్ సాధించబోతున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాకి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్.. దళపతి 69 సినిమాతో డబుల్ సెంచరీ సాధించాడని కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు.

Latest Videos

click me!