Senthil Kumar:అంత బిజీలో కూడా బిజినెస్ కోసం వచ్చిన అమ్మాయితో లవ్.. భార్య గురించి సెంథిల్ కుమార్ కామెంట్స్

First Published | Feb 16, 2024, 12:33 PM IST

రాజమౌళి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా ప్రఖ్యాత సాధించిన సెంథిల్ కుమార్ కుటుంబంలో గురువారం రోజు విషాదం చోటు చేసుకుంది. సెంథిల్ కుమార్ కుటుంబం ఏమాత్రం జీర్ణించుకోలేని విషాదం అది. సెంథిల్ కుమార్ సతీమణి రూహి అతి పిన్న వయసులో అనారోగ్యం కారణంగా మరణించారు.

రాజమౌళి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా ప్రఖ్యాత సాధించిన సెంథిల్ కుమార్ కుటుంబంలో గురువారం రోజు విషాదం చోటు చేసుకుంది. సెంథిల్ కుమార్ కుటుంబం ఏమాత్రం జీర్ణించుకోలేని విషాదం అది. సెంథిల్ కుమార్ సతీమణి రూహి అతి పిన్న వయసులో అనారోగ్యం కారణంగా మరణించారు. రూహి అకాల మరణంతో చిత్ర పరిశ్రమలో దిగ్బ్రాంతి నెలకొంది. 

సెంథిల్ కుమార్, రూహి 2009 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు సంతానం. అంతా హ్యాపీగా జరిగిపోతోంది అనుకుంటున్న తరుణంలో సెంథిల్ కుమార్ ఫ్యామిలీకి పెను విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ సమయం నుంచి రూహికి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. దీనితో ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో ఆమె మరణించారు. 


ఈ తరుణంలో సెంథిల్ కుమార్ తన భార్య గురించి, తమ ప్రేమ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మగధీర చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో సెంథిల్ కి రూహి పరిచయం అయిందట. సెంథిల్ కుమార్ అంటే తమిళ పేరులా ఉంది. తన తల్లి దండ్రులు తమిళులే అయినప్పటి తాను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే అని సెంథిల్ తెలిపారు. 

మగధీర షూటింగ్ జరుగుతున్న సమయంలో రూహి హైదరాబాద్ కి వచ్చింది. ఆమె స్వస్థలం ముంబయి. రూహి యోగా టీచర్.. భూమిక భర్త భరత్ ఠాకూర్ యోగ సెంటర్ లో ఆమె ఒక మెంబర్ గా పనిచేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ లో కూడా యోగ సెంటర్ ని ప్రారంభించాలనే బిజినెస్ ప్లాన్ తో హైదరాబాద్ కి వచ్చారు. అప్పుడే పరిచయం ఏర్పడింది. 

నేనేమో ఒకవైపు మగధీర, అరుంధతి చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా. ఆ టైం లో లవ్ కి సమయం కేటాయించడం అంటే నాకు పెద్ద ఛాలెంజ్ గా మారింది.  కానీ దేవుడి దయవల్ల అంతా సవ్యంగా జరిగింది అని సెంథిల్ కుమార్ గుర్తు చేసుకున్నారు. తక్కువ సమయంలోనే రూహి టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకు క్లోజ్ గా మారింది. 

సెంథిల్ కుమార్ రాజమౌళి తెరకెక్కించిన సై, మగధీర, యమదొంగ, బాహుబలి, ఛత్రపతి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలకు డీఓపీగా పనిచేశారు. సెంథిల్ కెమెరా పనితనం విమర్శకుల  ప్రశంసలు దక్కించుకుంది. కాగా ఈ కష్టకాలంలో సెంథిల్ కుమార్ కుటుంబానికి సినీ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు. 

Latest Videos

click me!