ఐశ్వర్య రాయ్ పై కంగనా కామెంట్స్.. అంతమాట అనేసిందేంటి ..?

Published : Feb 16, 2024, 01:26 PM IST

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతోంది కంగనా రనౌత్. కాంట్రవర్సీక్వీన్ గా పేరు తెచ్చుకుంది. విదాలకు కు కేరాఫ్ అడ్రస్ గా మరిపోయింది. స్టార్స్ ఎవరైనా.. వారిగురించి చెప్పాల్సి వస్తే.. అస్సలు  సంకోచించదు. ఇక తాజగా ఆమె ఐశ్వర్యరాయ్ మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
16
ఐశ్వర్య రాయ్ పై కంగనా కామెంట్స్..  అంతమాట అనేసిందేంటి ..?

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాటలు సూటిగా ఉంటాయి. ఎప్పుడు ఏది అనిపిస్తే అది టక్కున అనేస్తుంది బ్యూటీ. అంతే కాదు ఎవరినైనా ఏదైనా అనాలన్నా.. వారు ఎంతటివారు అనేది చూసుకోదు...మాట అనేస్తుంది. అంతే కాదు ఎమైనా అనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తూ ఉంటుంది. తన మనసులోని భావాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బయటపెడుతూనే ఉంటుంది. 

26

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కంగనా రనౌత్  తన అభిమానుల కోసం రకరకాల ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కంగనా రనౌత్ సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతున్నాయి. సౌత్ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసింది కంగనా. తమిళంలో ఎక్కుగా సినిమాలు చేస్తోంది. అంతే కాదు కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతుందనే టాక్ కూడా గట్టిగా  వినిపిస్తుంది. 
 

36

ఇక ఇప్పుడు మరోసారి కంగనా షాకింగ్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో కంగనా రనౌత్ ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడింది. దీనితో పాటు, కంగనా రనౌత్ ఐశ్వర్య రాయ్  వీడియోను షేర్ చేసింది. కంగనా రనౌత్ ‘హమ్ దిల్ దే చుకే సనమ్’లోని క్లిప్‌ను షేర్ చేసింది. ఐష్ చాలా అందంగా ఉంది అంటూ ప్రశంసించింది కంగనా. ఇప్పుడు కంగనా రనౌత్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. 

46

కంగనా రనౌత్, ఐశ్వర్యారాయ్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. గతంలో కూడా కంగనా ఐశ్వర్య మీద కామెంట్స్ చేసింది. చందమామ ఎలా అయితే ఎప్పటికి మారకుండా ఉంటుందో ఐష్ కూడా అలానే ఉంటుందని తెలిపింది కంగనా రనౌత్.గతంలో కూడా ఐశ్వర్య గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆడవారి వయస్సును ఉద్దుశిస్తూ.. . అందులోను ఐశ్వర్యా రాయ్ పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

56

 40,50 ఏళ్లు వచ్చిన తర్వాత ఆడవారి అందాన్ని ఎవరూ పట్టించుకోరు అంటూ కామెంట్స్ చేసింది గతంలో. సాంగ్ రైటర్స్ అనేవారు కేవలం యువతుల అందాల గురించి మాత్రమే పాటలు రాస్తున్నారని, 40, 50 ఏళ్లు వచ్చిన తర్వాత ఆడవారు ఎంత అందంగా ఉంటారో చెప్పడం లేదని కంగనా కామెంట్స్ చేసింది.  ఈసందర్భంగా పొన్నియిన్ సెల్వన్  సినిమాను ఉదాహరణగా చూపించింది బ్యూటీ.. ఈమూవీ నుంచి  ఐశ్వర్య రాయ్‌ క్లిప్ ఒకటి షేర్ చేసింది. 

66

ఇందులో ఐశ్వర్య రాయ్ చాలా అందంగా, అసలు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా ఉంది.ఈసినిమాలో మణిరత్నం  హీరోల పాత్రల కంటే హీరోయిన్స్ పాత్రలకే  ఎక్కువ విలువిచ్చారు. అందులో  ప్రేక్షకులు ఎక్కువగా ఫ్యాన్స్ అయ్యింది కూడా  కుందవైగా నటించిన త్రిషకు, నందినిగా నటించిన ఐశ్వర్ రాయ్‌కే. ఇద్దరికి సమానంగా గుర్తింపు లభించింది అని  అప్పుడు కామెంట్ చేసిందికంగనా. 
 

Read more Photos on
click me!

Recommended Stories