టైటిల్ ఫేవరేట్ కి భారీ షాక్, ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్, అనూహ్య ఫలితం రానుందా?

First Published | Dec 13, 2024, 11:43 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగింపు దశలో ఉంది. టైటిల్ ఎవరిదో ఈ ఆదివారం తేలిపోనుంది. కాగా ఓటింగ్ గమనిస్తే ఊహించని ఫలితాలు నమోదు అవుతున్నాయి. విన్నర్ ఎవరో తెలియని పరిస్థితి. 

బిగ్ బాస్ రియాలిటీ షోకి అత్యంత ఆదరణ దక్కుతుంది. తెలుగులో ప్రసారమైన ఏడు సీజన్స్ గ్రాండ్ సక్సెస్. సీజన్ 8 సైతం మెప్పించింది. సెప్టెంబర్ 1న ప్రసారమైన సీజన్ 8 ముగింపు దశకు చేరింది. సెప్టెంబర్ 15 ఆదివారం గ్రాండ్ ఫినాలే. ఈ సీజన్ కి గాను మొత్తం 22 మంది సెలెబ్స్ కంటెస్ట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. వారు మాజీ కంటెస్టెంట్స్ కావడం మరొక విశేషం. 

కాగా అవినాష్, నబీల్, అఖిల్, ప్రేరణ, గౌతమ్.. టాప్ 5 కంటెస్టెంట్స్. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ఒక ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే... అవినాష్ అత్యల్ప ఓట్లతో చివరి స్థానానికి పరిమితం అయ్యాడట. అవినాష్ ఏ విధంగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అవినాష్ టైటిల్ రేసులో లేడని సమాచారం. 


Bigg boss telugu 8

ఫైనల్ కి వచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రేరణ. ఈ కన్నడ సీరియల్ నటి ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం దక్కించుకుంది. చివరి వారంలో ఆమెకు పెద్దగా ఓట్లు పోల్ కావడం లేదట. దీంతో నాలుగో స్థానానికి ప్రేరణ పరిమితం అయ్యారట. ఆమె కంటే మెరుగైన ఓటింగ్ నబీల్ రాబడుతున్నాడట. నబీల్ ప్రస్తుతం మూడో స్థానం ఉన్నారట. 

కాగా టైటిల్ పోరు నిఖిల్, గౌతమ్ మధ్యనే అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఇది ఓటింగ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్నాడు. అతడి గేమ్ ఆకట్టుకుంది. టాస్క్ లలో నిఖిల్ చాలా కష్టపడతాడు. అందుకే ఆయనకు విజయాలు దక్కుతాయి. నిఖిల్ కి ఎదురు లేదు, టైటిల్ ఆయనదే అనుకుంటున్న తరుణంలో, గౌతమ్ ని గట్టి పోటీ ఎదరువుతుంది. 
 

లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం గౌతమ్ కి భారీగా ఓట్లు పోల్ అవుతున్నాయి. అతడు నిఖిల్ కంటే చాలా ముందు ఉన్నాడట. గౌతమ్ కి 42 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అదే సమయంలో నిఖిల్ కి దాదాపు 37 శాతం ఓట్లు పోల్ అయ్యాయట. ఇద్దరి మధ్య 5 శాతం ఓటింగ్ వ్యత్యాసం ఉంది. మరి ఇదే చివరి వరకు కొనసాగితే గౌతమ్ టైటిల్ విన్నర్ అవుతాడు. 

అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన గౌతమ్ కి టైటిల్ ఇవ్వడం  సరికాదనే వాదన ఉంది. ఐదు వారాల అనంతరం గేమ్, కంటెస్టెంట్స్ ఆట తీరు, పాపులారిటీ చూసి వచ్చిన గౌతమ్ ని విన్నర్ ని చేయడం తప్పుడు నిర్ణయం అంటున్నారు. బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం ప్రేక్షకులు ఓట్లు వేసిన వారికే టైటిల్ ఇవ్వాలి. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి.. 

Latest Videos

click me!