కృతి శెట్టికి తండ్రిగా నాలాంటి హీరోలు నటించరు..ఆమెని హీరోయిన్ గా తీసుకుందాం అంటే వద్దని చెప్పా 

Published : Jun 10, 2024, 05:47 PM IST

సౌత్ లో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి దూసుకుపోతున్నారు. కేవలం హీరో పాత్రల కోసమే ఎదురుచూడకుండా ఎలాంటి పాత్రలో అయినా నట విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు.

PREV
16
కృతి శెట్టికి తండ్రిగా నాలాంటి హీరోలు నటించరు..ఆమెని హీరోయిన్ గా తీసుకుందాం అంటే వద్దని చెప్పా 

సౌత్ లో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి దూసుకుపోతున్నారు. కేవలం హీరో పాత్రల కోసమే ఎదురుచూడకుండా ఎలాంటి పాత్రలో అయినా నట విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్ర ఎంతలా హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

26

విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ. ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతోంది. నీతిలాన్ స్వామినాథన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడారు. విజయ్ సేతుపతి తెలుగు మీడియా ముందుకు వస్తే తప్పకుండా ఉప్పెన చిత్రం గురించి అడుగుతారు. 

36

అయితే ఈ ప్రెస్ మీట్ లో కృతి శెట్టి గురించి అడిగారు. విజయ్ ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతి నటించే చిత్రాలలో ఒకదానికి కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. విజయ్ సేతుపతిని తన డైరెక్టర్ కృతి శెట్టి గురించి అడిగారట. ఆమె వద్దని మొహమాటం లేకుండా విజయ్ సేతుపతి చెప్పేశారు. 

46

ఉప్పెనలో కృతి శెట్టి నాకు కూతురిగా నటించింది. ఆమె షూటింగ్ లో ఇబ్బంది పడుతుంటే.. నన్ను నీ ఫాదర్ లాగే భావించు టెన్షన్ పడకు అని చెప్పా. అలా చెప్పిన తర్వాతఆమెని హీరోయిన్ గా పెట్టుకుని రొమాన్స్ చేస్తే ఏం బావుంటుంది. ఒక వేళ కృతి శెట్టిని నాతో నటించమని ఎవరైనా అడిగినా ఆమె కూడా నో చెబుతుందేమో అని విజయ్ సేతుపతి తెలిపారు. 

56

ఉప్పెన చిత్రాన్ని తాను కేవలం బుచ్చిబాబు కోసమే చేశానని విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. కృతి శెట్టి లాంటి హీరోయిన్ కి నా లాంటి హీరోలు ఎవరూ తండ్రిగా నటించరు. కనై సినిమాపై బుచ్చిబాబుకి ఉన్న ఫ్యాషన్ వల్లే ఆ చిత్రంలో నటించాను. తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని మరీ ఆ చిత్రంలో నటించినట్లు విజయ్ సేతుపతి అన్నారు. 

66

అదే విధంగా విజయ్ సేతుపతి ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన రియల్ హీరోలా నిలబడి విజయం సాధించారని ప్రశంసలు కురిపించారు. 

 

click me!

Recommended Stories