చిరంజీవి, బాలయ్య, వెంకీ లని రామోజీ రావు ఎందుకు పక్కన పెట్టారో తెలుసా.. నాగార్జునకి మాత్రమే ఆ ఛాన్స్

Published : Jun 10, 2024, 03:55 PM IST

రామోజీ ఫిలిం సిటీ నిర్మించి టాలీవుడ్ స్థాయిని మరింత పెంచిన వ్యక్తి రామోజీ రావు. అలాంటి లెజెండ్ కోరుకుంటే బడా హీరోలతో భారీ చిత్రాలు చేయొచ్చు. కానీ ఏరోజు రామోజీ రావు స్టార్ హీరోల వెంట పడలేదు.

PREV
16
చిరంజీవి, బాలయ్య, వెంకీ లని రామోజీ రావు ఎందుకు పక్కన పెట్టారో తెలుసా.. నాగార్జునకి మాత్రమే ఆ ఛాన్స్

మీడియా లెజెండ్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీ రావు జూన్ 8న అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. మీడియా రంగంతో పాటు సినిమా నిర్మాతగా కూడా రామోజీ రావు సూపర్ సక్సెస్ ఫుల్. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో ఆయన అనేక సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. 

 

 

26

రామోజీ ఫిలిం సిటీ నిర్మించి టాలీవుడ్ స్థాయిని మరింత పెంచిన వ్యక్తి రామోజీ రావు. అలాంటి లెజెండ్ కోరుకుంటే బడా హీరోలతో భారీ చిత్రాలు చేయొచ్చు. కానీ ఏరోజు రామోజీ రావు స్టార్ హీరోల వెంట పడలేదు. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎక్కువ భాగం కొత్త నటీనటులు లేదా అప్పటి టైర్ 2 హీరోలతోనే ఉంటాయి. 

36

చిరంజీవి టాలీవుడ్ లో మెగాస్టార్. రామోజీ రావు కోరుకుంటే స్టార్ డైరెక్టర్ ని పెట్టి చిరంజీవితో సినిమా చేయొచ్చు. కానీ రామోజీ రావు అలా చేయలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ తో రామోజీ రావు సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తనయుడు బాలయ్యతో రామోజీ రావుకి మంచి సాన్నిహిత్యం ఉంది. బాలయ్యతో కూడా సినిమా చేసి ఉండొచ్చు. అదే విధంగా వెంకీ కూడా ఉన్నారు. 

46

కానీ రామోజీ రావు స్టార్ హీరోల వెంట పడలేదు. సినిమాకి స్టార్ హీరోలు, డైరెక్టర్లు అవసరం లేదు.. క్వాలిటీ బావుంటే ఎవరితో తీసినా ఒక్కటే అని నమ్మే వ్యక్తి రామోజీ రావు. 

56

రామోజీ రావుతో సినిమా చేసే ఛాన్స్ అప్పటి స్టార్ హీరోల్లో నాగార్జునకి మాత్రం దక్కింది. సింగీతం శ్రీనివాస రావు దర్శకుడిగా ఆకాశ వీధిలో అనే చచిత్రాన్ని రామోజీ రావు నిర్మించారు. రవీనా టాండన్ ఈ చిత్రంలో హీరోయిన్. కీరవాణి సంగీతం అందించారు. 

66
Balakrishna

దురదృష్టవ శాత్తూ భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. కానీ రామోజీరావు నిర్మాణంలో నటించిన అప్పటి స్టార్ హీరోగా నాగార్జున నిలిచిపోయారు. 

Read more Photos on
click me!

Recommended Stories