మహేష్ బాబు వల్లే ఈ స్థాయిలో ఉన్నా... విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..?

First Published | Aug 14, 2024, 2:41 PM IST

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి  షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేష్ బాబు వల్లే తాను ఇలా ఉన్నానన్నారు. ఇంతకీ ఆయన ఈ మాట ఎందుకు అన్నారు.. ? 
 

vijay sethupathi

విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. అద్భుతమైన పాత్రలెన్నో చేశాడు. హీరో పాత్రలు చేయాలనే రూల్ పెట్టుకోకుండా.. యాక్టింగ్ స్కోప్ ఉన్న మంచి మంచి పాత్రలను సెలక్ట్ చేసుకుని మరీ నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళంతో పాటు తెలుగు సినిమాల్లో కూడా విజయ్ సేతుపతి పాపులర్ అయ్యాడు. ఇక రీసెంట్ గా జవాన్ సినిమాతో బాలీవుడ్ గడప కూడా తొక్కాడు విజయ్ సేతుపతి. 

తమిళ తెలుగు భాషల్లో స్టార్ నటుడిగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి.. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కూడా తాను ఎప్పుడు కలిసి నటించని మహేష్ బాబు గురించి విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. మహేష్ బాబు వల్లే తాను ఇప్పుడు ఈ పోజిషియన్ లో ఉన్నాను అన్నారు. 


vijay sethupathi - mahesh babu

ఇంతకీ విజయ సేతుపతి ఇలా ఎందుకు అన్నారు..? కారణం ఏంటి..? రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఈ విషయాన్ని వెల్లడించారు. విజయ్ కు మహేష్ బాబు నటించిన అతడు సినిమా చాలా ఇష్టమట. ఆసినిమాను మొదటి నుంచి.. చివరి వరకూ నాన్ స్టాప్ గా చూస్తాడట విజయ్. ఇలా ఎన్నో సార్లు చూశాడట. తాను ఎ టెన్షన్ లో ఉన్నా.. తనకు ఎటువంటి కష్టం అనిపించినా.. ఈసినిమా చూసి చాలా రిలాక్స్ అవుతాడట. 

అతను సినిమా చూస్తే.. ఇందులో త్రివిక్రమ్ డైలాగ్స్ తో పాటు.. సినిమాలో పాత్రలు తనను తాను చూసుకున్నట్టుగా ఉంటుందట. తన జీవితంలో కొన్ని సన్నివేశాలు తన లైఫ్ తో మ్యాచ్ అవుతాయి అంటున్నారు విజయ్. ఇక విజయ్ సేతుపతి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా విజయ్ సేతుపతి  రీసెంట్ గా తన 50వ సినిమాలో నటించాడు మహారాజ్ టైటిల్ తో రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

vijay sethupathi

మహారాజ్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో 100 కోట్లు కలెక్ట్ చేసింది. విజయ్ సేతుపతి కెరీర్ లోనే ఈసినిమా ఫస్ట్ 100కోట్ల సినిమా అయ్యింది. నటుడిగా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా ఈసినిమా విజయ్ కు సక్సెస్ ను ఇచ్చింది. ఇక తెలుగులో ఉప్పెన లాంటి సినిమాలు చేసిన విజయ్.. టాలీవుడ్ లో మరిన్ని సినిమాలకు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!