ఈ లిస్ట్ లో సావిత్రి పేరు చెప్పకుండా ఉండలేం. స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ముందు ఉండేది ఆమె పేరే. తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర నటిగా వెలుగొందిన సావిత్రి హిందీ, కన్నడ భాషల్లోనూ నటించింది. 250కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో మహానటిగా.. తమిళంలో నడిగర్ తిలగంగా ప్రసిద్ధి చెందిన సావిత్రి 1950 మరియు 1960లలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఒకరు. స్టార్ హీరోల డేట్లు అయినా దొరికేవేమో కాని.. సావిత్రి డేట్ల కోసం ఎదుచూసేవారట దర్శకులు.
ఇక తెలుగు, తమిళ భాషలతో పాటు.. హిందీలో కూడా స్టార్ లకే స్టార్ గా వెలిగింది శ్రీదేవి. ఇండియన్ సినిమా ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి దాదాపు స్టార్ హీరోలందరితో ఆడిపాడింది. హిందీలో రంగప్రవేశం చేసి బాలీవుడ్‌లోనూ అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం నటనకు దూరంగా ఉన్న ఆమె.. ఆతరువాత ఇంగ్లీషు, వింగ్లీష్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.. 2018 లో దుబాయ్ లో అనుమానస్పద పరిస్థితుల్లో ఆమె మరణించింది.
Vijayashanthi Quits BJP
ఇక సౌత్ సినిమాలల్లో లేడీ సూపర్ స్టార్ గా పేరు ఉన్న నటి విజయశాంతి. హీరోయిన్ గా ఎంత బ్యూటీఫుల్ పాత్రలు చేసిందో.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచింది. లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు విజయశాంతి న్యాయం చేసినంతగా ఇంకెవరూ చేయలేరేమో.. ఇక ప్రస్తుతం ఆమె మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. అప్పుడప్పుడు మాత్రమే ఒకటీ అరా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి నటిస్తున్నారు.
ఇక సావిత్రి తరువాత అంత పద్దతిగల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సౌందర్య. 90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమా అగ్ర నటిగా వెలుగొందింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు హిట్ చిత్రాలలో నటించారు. సౌందర్య తన 20 ఏళ్ల స్క్రీన్ కెరీర్‌లో.... ఎటువంట రిమార్క్ తెచ్చుకోలేదు. తెలుగు,తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో ఆమె నటించింది. ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన ఆమె 2004లో విమాన ప్రమాదంలో మరణించింది.
సౌత్ లో పవర్ ఫుల్ పాత్రల్లో మెరిసిన మరో హీరోయిన్ రమ్య కృష్ణ. కెరీరి బిగినింగ్ లో హీరోయిన్ గా ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ.. హీరోయిన్ గా నటిస్తూనే పవర్ పాత్రలకు ప్రాణం పోసింది. నరసింహా సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా.. ఆమె నటన తన మూవీకెరీర్ నే మలుపుతిప్పింది. అంతే కాదు చాలా కాలానికి ఆమె బాహుబలితో చేసిన శివగామి పాత్ర.. పాన్ ఇండయానే ఆకర్శించింది. ఇలా వరుసగా అద్భుతమైన పాత్రలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ లేడీ సూపర్ స్టార్ గా నిలబడేలా చేసింది.
ఇక ఈ లిస్ట్ లే చేరిన మరో హీరోయిన్ అనుష్క. ఆమెకూడా అరుంధతి, భాగమతి లాంటిసినిమాలతో లేడీ సూపర్ స్టార్ గామారింది. ఇక బాహుబలి సినిమాలో దేవసేనగా.. గ్లామర్ పాత్రతో పాటు వీరమాతగా ఆమె నటన అద్భుతం అని చెప్పాలి. సౌత్ సినిమాలో స్టార్ హీరోనలతో సమానంగా ఇమేజ్ సాధించని నటిగా అనుష్క పేరు తెచ్చుకుంది.
Nayanthara
ఇక తమిళ, తెలుగు సినిమాల్లో లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన మరో హీరోయిన్ నయనతార. దాదాపు 20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అలాగే కొనసాగిస్తుంది బ్యూటీ. 40 ఏళ్ళకు చాలా దగ్గరలో ఉన్న ఈ హీరోయిన్.. పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇహేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకుంటూ.. దూసుకుపోతోంది నయనతార.