ఈ వేడుక జరిగి వారం గడవక ముందే సమంత రూపంలో మరొక సెన్సేషన్ తెరపైకి వచ్చింది. సమంత ఓ స్టార్ దర్శకుడితో ఎఫైర్ లో ఉందట. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్-సమంత రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే సక్సెఫుల్ గా రాణిస్తున్నారు. వీరిద్దరూ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ సిరీస్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.