Maharaja Movie
మన ఇండియన్ సినిమాలు చైనాలో కూడా బిజినెస్ ఓపెన్ చేయటం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా విజయ సేతుపతి నటించిన మహారాజా చిత్రం కూడా చైనాలో సత్తా చాటుతుంది. నవంబర్ 29న సుమారు 40 వేలకు పైగా థియేటర్స్‌లలో ఈ చిత్రం విడుదలైంది. మహారాజా చైనా రోజువారీ బాక్స్ ఆఫీస్ ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఈ చిత్రం చైనా కలెక్షన్స్ ఏ స్దాయిలో వస్తున్నాయి. ఎంత ఇప్పటిదాకా రాబట్టిందో చూద్దాం.
Vijay Sethupathis film Maharaja collection report out
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మహారాజా తమిళంలో పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం విజయ్ సేతుపతి అద్భుతమైన నటన,డైరక్టర్ టాలెంట్, అద్బుతమైన స్క్రీన్ ప్లే ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం విడుదలై దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు, మహారాజా చిత్రాన్ని నిర్మాతలు చైనాలో విడుదల చేశారు, అక్కడ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
Maharaja in china
ఫస్ట్ వీకెండ్ కు , మహారాజా $4.82 మిలియన్ (భారత రూపాయలలో సుమారు 40.82 కోట్లు) వసూలు చేయగలిగింది. ఇది చిత్రానికి మంచి కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వీకెండ్ లో ఇంకా ఎక్కువ వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చైనాలో సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే, మహారాజా అక్కడ లాంగ్ రన్ సాధించే అవకాశముంది.
Vijay Sethupathi starrer Maharajas collection report out
ఈ క్రమంలో మహారాజా టీమ్ ఆనందంతో ఉత్సాహంగా ఉంది. మహారాజాకు ముందు కొంతకాలం సైలెంట్ గా ఉన్న విజయ్ సేతుపతి ఈ సినిమాతో మళ్లీ తన ట్రాక్‌లోకి వచ్చారు. చైనాలో మహారాజా సాధించిన విజయం టీమ్ ఆనందానికి మరొక కారణం. మరి రెండో వారంలో ఈ సినిమా ఎలాంటి ఫెరఫార్మ్ చూపిస్తుందో చూద్దాం. లాంగ్ రన్ లో మహారాజ కొత్త మైలురాళ్ళు సృష్టించడం ఖాయం అని అంటున్నారు.
Vijay Sethupathis Maharaja china collection report out
వాస్తవానికి మహారాజా చిత్రం తమిళంకే పరిమితంగా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే సినిమాలో ఊహించని ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలిన్ సామినాథన్ మలవటం కలిసొచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా బాగా ఆడింది.
ప్రభాస్ కల్కి సినిమా రాకపోతే ఈ సినిమా రన్ ఇంకా ఉండేది. అయితేనేం ఇప్పుడు జాక్ పాట్ కొట్టింది. ఇతర దేశాలకు వెళ్తోంది. ఒక ఇండియన్ చిన్న సినిమా చైనాలో ఇంత పెద్ద ఎత్తున విడుదల కానున్నడంతో సినీ అభిమానులు ఆనందం మామూలుగా లేదు. ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కావడం మామూలు విషయం కాదు. లిమిటెడ్ షోలే అయినా మొత్తం హౌస్ ఫుల్స్ కావడం గమనార్హం.