మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీలో పెద్ద ట్విస్ట్, సినిమా క్యాన్సిల్‌?.. అఫీషియల్‌గా బాలయ్య ఏం చెప్పాడంటే?

Published : Dec 06, 2024, 07:46 AM IST

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సినిమా ప్రశాంత్‌ వర్మతో ఉండబోతున్న విషయం తెలిసిందే. ఇది క్యాన్సిల్‌ అయ్యిందంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
15
మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీలో పెద్ద ట్విస్ట్, సినిమా క్యాన్సిల్‌?.. అఫీషియల్‌గా బాలయ్య ఏం చెప్పాడంటే?
Mokshagna Nandamuri

నందమూరి బాలకృష్ణ వారసుడిగా తన కుమారుడు మోక్షజ్ఞ తేజ సినిమాల్లోకి రాబోతున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్‌ దర్శకుడు, `హనుమాన్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఈ మూవీ ఈ వారమే ప్రారంభం కాబోతుందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు బ్యాక్‌ టూ బ్యాక్‌ మోక్షజ్ఞ మూడు సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

25
Mokshagna

ఇదిలా ఉంటే ప్రశాంత్‌ వర్మతోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఇది తన ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్ లో భాగంగా రాబోతుంది. `సింబా` అనే టైటిల్‌ ని కూడా అనుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఓ షాకింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ మూవీ క్యాన్సిల్‌ అంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ప్రశాంత్‌ వర్మ రెండు సినిమాలు క్యాన్సిల్‌ అయ్యాయని, మోక్షజ్ఞ తేజతో సినిమా, రణ్‌వీర్‌ సింగ్‌తో మూవీ క్యాన్సిల్‌ అంటూ ప్రచారం ప్రారంభమైంది. రణ్‌వీర్‌ సింగ్‌తో ఉండబోదని చాలా రోజుల క్రితమే వాళ్లే ప్రకటించారు. భవిష్యత్‌లో కలిసి పనిచేస్తామని తెలిపారు. 
 

35

ఇప్పుడు `జై హనుమాన్‌`తోపాటు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ సినిమా చేయడంలో ప్రశాంత్‌ వర్మ బిజీగా ఉన్నారని అన్నారు. అలాగే ఈ మూవీ కోసం మోక్షజ్ఞ కూడా ప్రిపేర్‌ అవుతున్నారని, యాక్టింగ్‌ స్కూల్‌లో బిజీగా ఉన్నాడని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ గురువారమే ప్రారంభించాలనుకున్నారు. కానీ జరగలేదు. దీనితో సినిమా క్యాన్సిల్‌ అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది.

ఈ నేపథ్యంలో దీనిపై బాలయ్య స్పందించారు. కొడుకు సినిమా ఈ రోజే(గురువారం) మొదలు పెట్టాల్సింది, కానీ మోక్షజ్ఞ అనారోగ్యంతో కుదరలేదు. వాతావరణం బాగా లేదు కదా, అందుకే కొన్ని రోజులు పోస్ట్ పోన్‌ చేశాం. ఏదైనా మన మంచికే కదా అని చెప్పారు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఈ విషయం వెల్లడించారు.

45
Mokshagna Nandamuri

బాలయ్య తన మాటల్లో సినిమా ప్రారంభాన్ని వాయిదా వేశామని తెలిపారు. కానీ క్యాన్సిల్‌ అని చెప్పలేదు. దీంతో సినిమా ఉంటుందనేది క్లారిటీ. అయితే సినిమా క్యాన్సిల్‌ విషయాన్ని ఆయన ఇలా కవర్‌ చేశారా? లేక క్యాన్సిల్‌ వార్తల్లో నిజం లేదా? అనేది చూడాలి.

ఏదేమైనా భారీ స్థాయిలో నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీ ఉంటుందని అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వార్త బయటకు రావడం నందమూరి ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తుంది. 
 

55

ఇదిలా ఉంటే బాలయ్య తన కొడుకుతో సినిమాని ప్రకటించారు. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 4వ సీజన్‌... శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న 6వ ఎపిసోడ్‌లో ఈ విషయాన్ని తెలిపారు. మోక్షజ్ఞ హీరోగా `ఆదిత్య 999` తీయబోతున్నట్టు తెలిపారు.

`ఆదిత్య 999 మ్యాక్స్` గా దీన్ని తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. ఈ మూవీకి తనే దర్శకుడు, నిర్మాత. ప్రశాంత్‌ వర్మ సినిమా నిజంగానే క్యాన్సిల్‌ అయితే మోక్షజ్ఞ ఎంట్రీ `ఆదిత్య 999`తో ఉండే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.  

read more: నిర్మాత ఆపేద్దామని చెప్పినా వినకుండా సినిమా రిలీజ్‌ చేయించిన జూ.ఎన్టీఆర్‌, ఫలితం చూశాక ఫ్యూజుల్‌ ఔట్‌

also read: `పుష్ప-పుష్ప2`కి ఉన్న పోలికలు, తేడాలు.. సుకుమార్‌ చేసిన మ్యాజిక్ ఏంటి?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories