Vijay Sangeetha: విజయ్-సంగీత లవ్ స్టోరీ టూ డివోర్స్ డ్రామా.. అసలు ఏం జరిగింది?

Published : Aug 07, 2026, 06:25 PM IST

Vijay Sangeetha: అభిమానిగా మొదలై భార్యగా మారిన సంగీత, విజయ్‌తో 27 ఏళ్ల బంధం తర్వాత విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కారు. అయితే, అనూహ్యంగా డివోర్స్ పిటిషన్ వెనక్కి తీసుకుంది. విజయ్-సంగీత లవ్ స్టోరీ టూ డివోర్స్ డ్రామాలో అసలు ఏం జరిగింది?

PREV
15
అభిమాని నుంచి లైఫ్ పార్ట్‌నర్‌గా మారిన ప్రయాణం

తమిళనాడు సీఎం, ప్రముఖ నటుడు దళపతి విజయ్, యూకేకు చెందిన శ్రీలంకన్ తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె సంగీత సోర్నలింగంల బంధం ఒక విభిన్నమైన లవ్ స్టోరీగా మొదలైంది. సంగీత విజయ్‌కి పెద్ద అభిమాని. 1996లో విజయ్ నటించిన ‘పూవే ఉనక్కాగా’ సినిమా సూపర్ హిట్ అయ్యాక, అతడిని నేరుగా కలిసి అభినందించాలని ఆమె లండన్ నుంచి చెన్నై వచ్చారు. షూటింగ్ స్పాట్‌లో విజయ్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిరాడంబరత, నిజాయితీ నచ్చి విజయ్ ఆమెను తన కుటుంబానికి పరిచయం చేశారు.

25
కుటుంబాల అంగీకారం, భిన్న మతాల వివాహం

విజయ్ తల్లిదండ్రులు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్, గాయని శోభా చంద్రశేఖర్ లకు సంగీత బాగా నచ్చింది. వారే స్వయంగా లండన్‌లోని సంగీత కుటుంబ సభ్యులను కలసి పెళ్లి ప్రతిపాదన తెచ్చారు. మొదట జూలై 10, 1998న యూకేలో వీరి వివాహ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 25, 1999న చెన్నైలోని రాజా ముత్తయ్య హాల్లో సాంప్రదాయ హిందూ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. క్రైస్తవ మతానికి చెందిన విజయ్, హిందూ మతానికి చెందిన సంగీత ఒక్కటవ్వడం అప్పట్లో విశేషంగా నిలిచింది.

35
పిల్లల ఎంట్రీ, వెండితెరపై మెరుపులు

ఈ దంపతులకు జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ తండ్రి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. 2000లో జన్మించిన జాసన్ సంజయ్, 2009లో వచ్చిన ‘వేట్టైకారన్’ చిత్రంలోని "నా అడిచా" పాటలో బాల డాన్సర్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఆయన ఫిల్మ్‌మేకింగ్ కెరీర్‌ను ఎంచుకున్నాడు. 2005లో జన్మించిన కుమార్తె దివ్య సాషా, 2016లో వచ్చిన ‘తెరి’ సినిమా ఎండిగ్ సన్నివేశాల్లో మెరిసింది.

45
విడాకుల పిటిషన్, సంచలన ఆరోపణలు

27 ఏళ్ల దాంపత్యం తర్వాత, ఫిబ్రవరి 2026లో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, 1954 కింద విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. అందులో విజయ్‌కి వేరే నటితో అక్రమ సంబంధం ఉందని, ఏప్రిల్ 2021లో ఆ విషయం తనకు తెలిసిందని సంగీత ఆరోపించింది. మానసిక వేధింపుల ఆధారంగా విడాకులు కావాలని కోరింది.

సోషల్ మీడియాలో నటి త్రిషతో విజయ్‌ను ముడిపెడుతూ వార్తలు వచ్చినప్పటికీ, ఈ అంశంపై విజయ్ కానీ, త్రిష కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చట్టబద్ధమైన ఆధారాలు కూడా ఏవీ బయటకు రాలేదు. న్యాయపోరాటం మొదలవడానికి ముందే వీరిద్దరూ కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి.

55
కేసు విత్‌డ్రా, ముగిసిన లీగల్ డ్రామా

తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసుకు ఆగస్టు 7న ఊహించని మలుపు తిరిగింది. చెంగల్పట్టు జిల్లా కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను సంగీత వెనక్కి తీసుకుంది. సంగీత పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ విడాకుల విచారణను అధికారికంగా మూసివేసింది. దీంతో కొన్ని నెలలుగా తమిళనాడు వ్యాప్తంగా, సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ వివాహ వివాదానికి తెరపడింది.

Read more Photos on
click me!

Recommended Stories