విజయ్ దళపతి కొత్త కారు.. విమానం కంటే హైటెక్! ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..? రేటు ఎంతంటే..?

First Published | Oct 31, 2024, 6:04 PM IST

విజయ్ కొత్తగా కొన్న లెక్సస్ LM 350h కారులో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. 48 ఇంచ్ టీవీ, 23 స్పీకర్ల ఆడియో సిస్టమ్, మసాజ్ సీట్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంతకీ ఆ కారు ధర ఎంతోె తెలుసా..? 

కార్లను ఇష్టపడనివారంటూ ఉండరు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరు కార్లకు ఫ్యాన్స్. కోట్లు పెట్లి కార్లు కొంటుంటారు. ఇక్రమంలో తమిళ మీరోలలో  అజిత్ కి కార్ రేసింగ్ అంటే  ఇష్టమైతే, విజయ్ కి కొత్త కార్లు కొనడం ఇష్టం. కొత్తగా మంచి ఫీచర్లతో కార్లు వస్తే వెంటనే కొనే  విజయ్ దగ్గర  దాదాపు  20 కి పైగా కార్లు ఉన్నాయి. వాటిలో 2 కోట్లకు పైగా విలువ చేసేవి 5 కి పైగా ఉన్నాయి.

2012 లో లండన్ నుండి రోల్స్ రాయిస్ గోస్ట్ కారుని ఇంపోర్ట్ చేసుకున్న విజయ్, దానికి సరిగ్గా టాక్స్ కట్టలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు కోర్టు వరకు వెళ్ళింది. ఆ కారుని అమ్మేసిన తర్వాత లెక్సస్ LM 350h కొన్నారు. ఈ కారు మార్చిలోనే మార్కెట్లోకి వచ్చింది. ముందే బుక్ చేసుకుని వెంటనే డెలివరీ తీసుకున్నారట. మరి ఈ కారులో అంత స్పెషల్ ఏముందో చూద్దాం.

Latest Videos


లగ్జరీ కార్లలో ఆడి, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్ లాంటి కార్లకు పోటీగా లెక్సస్ కొత్త కారు తయారు చేసింది. దీనికి, విమానానికి పెద్ద తేడా లేదు. నాలుగు, ఏడు సీట్ల వేరియంట్లలో వచ్చిన ఈ కారులో విజయ్ నాలుగు సీట్ల వేరియంట్ కొన్నారు. కస్టమర్లకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. 48 ఇంచ్ టీవీ, 23 స్పీకర్ల ఆడియో సిస్టమ్ ఉన్నాయి.

డ్రైవర్ సీట్ కి, వెనక సీట్లకి మధ్యలో పార్టిషన్ ఉండటంతో వెనక ఏం జరుగుతుందో డ్రైవర్ కి తెలియదు. మడత పెట్టుకునే టేబుల్స్, వైర్‌లెస్ ఛార్జర్, రీడింగ్ లైట్, అద్దాలు ఇలా అన్నీ ఉన్నాయి. ఇంకా, నీళ్ళు, కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఏసీ, హీటర్ కూడా ఉన్నాయి.

లెక్సస్ LM 350h

ఈ కారులో ముఖ్యమైనది సీట్లు. మెత్తగా ఉండే ఈ సీట్లలో పడుకుని ప్రయాణించవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటే బెడ్ రూమ్ లా మారిపోతుంది. మసాజ్ చేసే వైబ్రేటర్ కూడా ఉంది.

వెనక డోర్లు స్లైడింగ్ డోర్లు. రిమోట్ కీ తోనే డోర్లు ఓపెన్ చేయవచ్చు. పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ లో కూడా నడిచే ఈ కారులో 60 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.

360 డిగ్రీల కెమెరా సిస్టమ్ కూడా ఉంది. బీఎండబ్ల్యూ, ఆడి లాంటి కార్లు ఉన్నా, విజయ్ ఇన్నోవా, మారుతి సుజుకి లాంటి కార్లలోనే బయట తిరుగుతుంటారు. ఈ కొత్త లగ్జరీ కారు కొనడానికి ఆయన రాజకీయాలే కారణం అంటున్నారు.

click me!