స్టార్‌ హీరోయిన్‌తో రాజేంద్రప్రసాద్‌కి ఉత్తమ జంటగా సత్కారం.. ఇంటికెళ్లాక నటకిరీటి భార్య ఏం చేసిందో తెలుసా?

Published : Oct 31, 2024, 05:27 PM IST

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎక్కువ సినిమాలు చేయడం వల్ల బెస్ట్ పెయిర్‌గా సత్కారం జరిగిందట. అంతే ఇంటికెళ్లాక రాజేంద్రప్రసాద్‌ ఇచ్చే ట్రీట్‌ మెంట్‌ వేరే లెవల్‌లో ఉంటుందట.   

PREV
15
స్టార్‌ హీరోయిన్‌తో రాజేంద్రప్రసాద్‌కి ఉత్తమ జంటగా సత్కారం.. ఇంటికెళ్లాక నటకిరీటి భార్య ఏం చేసిందో తెలుసా?

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌.. తెలుగు సినిమాల్లో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. కామెడీ సినిమాలతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకీ, రాజశేఖర్‌, మోహన్‌బాబు, జగపతిబాబు, సుమన్‌ వంటి హీరోలు జోరు మీదున్నారు. వాళ్ల సినిమాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. వారికి పోటీగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలు చేసి మెప్పించాడు, స్టార్‌గా ఎదిగాడు రాజేంద్రప్రసాద్‌. ఆయన సినిమాల్లో అటు కమర్షియల్‌ ఎలిమెంట్లు, ఇటు ఫన్‌ ఉండటం విశేషం. అందుకే ఆయన సినిమాలను కూడా జనం బ్రహ్మరథం పట్టారు. సూపర్‌ హిట్లు చేశారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

25

అయితే కామెడీ హీరో అనే ట్యాగ్‌లో ఆయనతో చాలా మంది స్టార్‌ హీరోయిన్లు నటించేందుకు ఒప్పుకునే వాళ్లు కాదట. దీంతో కొంత మంది హీరోయిన్లతోనే ఎక్కువగా సినిమాలు చేయాల్సి వచ్చింది. అయినా రాజేంద్రప్రసాద్‌.. సౌందర్య, రాశీ, రమ్యకృష్ణ, మీనా, రంభ, నగ్మా వంటి హీరోయిన్లతోనూ కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఆకట్టుకుంటున్నారు. అయితే వీళ్లంతా కమర్షియల్‌ హీరోయిన్లుగా రాణిస్తున్న నేపథ్యంలో ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. కానీ కొందరు హీరోయిన్లతో ఎక్కువ మూవీస్‌ చేశారు. అలా రజనీ, ఆమని వంటి వారు ఉంటారు. 

35

వీళ్లతో ఎక్కువ మూవీస్‌ చేయడం కారణంగా అనేక రూమర్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా రజనీతో చాలా రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకుంటున్నారనే కామెంట్లు కూడా వచ్చాయి.ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్‌ కూడా ఒప్పుకున్నారు. అయితే తాను ఆ విషయంలో ఎలాంటి తప్పులు చేయలేదని, అందుకే ఈ స్థానంలో ఉన్నట్టు తెలిపారు రాజేంద్రప్రసాద్‌. అయితే తనతో చాలా మంది హీరోయిన్లు నో చెప్పడం కారణంగా ఆమనితో చాలా సినిమాలు చేసినట్టు తెలిపారు రాజేంద్రప్రసాద్‌. 
 

45

`ఆ నలుగురు` సినిమాలో తనకు బాగా సెట్‌ అయ్యే జోడీ కోసం చూశామని, చాలా మంది హీరోయిన్లు సెట్‌ కాలేదు. కానీ ఆమని కుదిరింది. ఆమెతో చాలా మూవీస్‌ చేయడం కారణంగానే అని, తమ కెమిస్ట్రీ వెండితెరపై బాగా పలికిందన్నారు. అప్పట్లో తమని బెస్ట్ జోడీగా పిలిచేవారట. రాజేంద్రప్రసాద్‌, ఆమనీలను బెస్ట్ వెండితెర కపుల్‌గా అభినందించేవాళ్లని, అంతటితో ఆగలేదని, ఓ సంస్థ వాళ్లు ఏకంగా సన్మానం కూడా చేసినట్టు తెలిపారు రాజేంద్రప్రసాద్. సినిమాల్లో తమ మధ్య కెమిస్ట్రీ అంతగా పండటంతో నిజం జీవితంలోనూ పెయిర్‌గానే భావించిన వాళ్లు చాలా మంది ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో తన భార్య కూడా కామెంట్‌ చేస్తుంటుందని, ఆమనితో తనకు సన్మానం తర్వాత తన భార్యా చాలా సార్లు ఆటపట్టించేదట. ఆమనితో సినిమా చేసి ఇంటికి వెళితే `ఆహా.. బెస్ట్ పెయిర్‌ ఎలా ఉన్నారు` అని దెబ్బిపొడుస్తుందని చెప్పారు. తనని చాలా సార్లు ఏడిపించేదని వెల్లడించారు రాజేంద్రప్రసాద్‌. 
 

55

రాజేంద్రప్రసాద్‌, ఆమని కాంబినేషన్‌లో `మిస్టర్‌ పెళ్లాం`, `కన్నయ్య కిట్టయ్య`, `ఆ నలుగురు`, `మహాజననికి మరదలు పిల్ల`, `ఎదురుంటి మొగుడు పక్కింటి పెళ్లాం`, `ఇదేం పెళ్లాం బాబోయ్‌`, `పచ్చని సంసారం` వంటి సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించి మెప్పించారు. బెస్ట్ ఆస్‌ స్క్రీన్‌ పెయిర్‌గా పేరుతెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు రాజేంద్రప్రసాద్‌ క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా మెప్పిస్తున్నారు. అలాగే ఆమని సైతం అటు సినిమాలు, ఇటు సీరియల్స్ చేసి అలరిస్తుంది. 
 

read more: `లక్కీ భాస్కర్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

also read: కిరణ్‌ అబ్బవరం `క` సినిమా రివ్యూ, రేటింగ్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories