సినిమాల్లో నేను కొట్టిన ఫస్ట్ సిక్స్ అదే, డకౌట్లు కూడా అయ్యాను.. తన కెరీర్ ని క్రికెట్ తో పోల్చిన ఎన్టీఆర్

First Published | Oct 31, 2024, 5:15 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దేవర, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తారక్ ని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టాయి. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దేవర, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తారక్ ని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టాయి. ఇండియాలో సినిమాలు, క్రికెట్ ఈ రెండు ఎక్కువగా ప్రజలని ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఎన్టీఆర్ కూడా క్రికెట్ బాగా ఫాలో అవుతారట. ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన కెరీర్ ని క్రికెట్ తో పోల్చుకున్నారు. 

తనకి బాగా ఇష్టమైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని ఎన్టీఆర్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు చాలా మంది మంచి క్రికెటర్స్ ఉండి ఉండొచ్చు. కానీ నాకు మాత్రం క్రికెట్ లో సచినే హీరో అని తెలిపారు. క్రికెటర్స్ అంటే నేషనల్ హీరోలు. వాళ్ళ బయోపిక్ చిత్రాల్లో నటించాలి అంటే గట్స్ ఉండాలి. క్రికెటర్ల బయోపిక్ చిత్రాల్లో నటించేంత ధైర్యం తనకి లేదని తారక్ తెలిపారు. ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. 

Latest Videos


మీ కెరీర్ లో ఫస్ట్ సిక్సర్ ఏదని యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఎన్టీఆర్ సమాధానంఇస్తూ .. కాస్త అలోచించి నా కెరీర్ లోనే ఫస్ట్ సిక్సర్ అంటే సింహాద్రి చిత్రం. సింహాద్రి సక్సెస్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ తర్వాత కూడా చాలా సిక్సర్లు కొట్టారు అని యాంకర్ తెలిపింది.. సిక్సులే కాదు భయంకరమైన డకౌట్లు కూడా అయ్యాను అంటూ ఎన్టీఆర్ ఫ్లాప్ చిత్రాల గురించి ప్రస్తావించాడు. 

కానీ వయసు పెరిగే కొద్దీ సక్సెస్ ని ఫెయిల్యూర్ ని సమానంగా తీసుకోవడం ప్రారంభించాను అని ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతం తారక్ హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవర తర్వాత తారక్ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం ఇదే. వచ్చే ఏడాది ఆగష్టు లో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

click me!