డ్రాగన్ టీమ్ కు విజయ్ అభినందనలు, దళపతి తో సినిమా కోసం ప్రదీప్ డైరెక్టర్ వెయిటింగ్

Vijay Meets Dragon Team: ప్రదీప్ రంగనాథన్, అశ్వంత్ మారిముత్తు కాంబోలో  రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది 'డ్రాగన్' మూవీ. ఈ సినిమా  సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు టీమ్. ఈక్రమంలో విజయ్ దళపతి డ్రాగన్ టీమ్ ను కలిశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Vijay Meets Dragon Team Viral Photos Aswanth Marimuthu in telugu jms

అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన సినిమా  'డ్రాగన్'. యువతను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. గత ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన డ్రాగన్ కు సామాన్యుల నుంచే కాదు సెలబ్రిటీ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. 

Vijay Meets Dragon Team Viral Photos Aswanth Marimuthu in telugu jms
150 కోట్లకు పైగా వసూలు చేసిన డ్రాగన్ సినిమా

అజిత్ నటించిన పట్టుదల సినిమా  350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈసినిమా  విడుదలై కేవలం 135 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కాని  కేవలం... 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన 'డ్రాగన్' సినిమా 150 కొట్లు కలెక్ట్ చేసి  ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ప్రదీప్ రంగనాథన్ నటన అదుర్స్ అంతే.


వరుస విజయాలు నమోదు చేసిన ప్రదీప్

ధనుష్ లాగే ప్రదీప్ నటిస్తున్నాడని కొన్ని విమర్శలు వచ్చినా, వాటిని అతను  పట్టించుకోలేదు.  రీసెంట్ గా  ఒక  ఇంటర్వ్యూలో తాను తనలాగే ప్రవర్తిస్తానని చెప్పాడు. నేను ధనుష్ లాగా కనిపిస్తున్నాను కాబట్టి సన్నగా ఉంటానని, అందుకే అభిమానులు నేను ధనుష్ లాగా కనిపిస్తున్నానని అనుకోవచ్చు అని ఆయన అన్నారు. 2022లో విడుదలైన  'లవ్ టుడే' విజయం తర్వాత, హీరోగా అతని రెండవ చిత్రం కూడా రూ. 100 కోట్లు వసూలు చేసింది.

ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న సినిమాలు

ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో LIK సినిమాలో నటిస్తున్నారు ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని నయనతార నిర్మాతగా రౌడీ పిక్చర్స్ నిర్మిస్తోంది. అదేవిధంగా, ప్రదీప్ రంగనాథన్ కూడా మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు.

డ్రాగన్ టీంతో విజయ్

కాగా ఈసినిమా రిలీజ్ అయిన అప్పటి నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు ఈసినిమాను మెచ్చుకున్నారు. ఇక  సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా డ్రాగన్ టీమ్ ను అభినందించారు. దర్శకుడిని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. తాజాగా దళపతి విజయ్ 'డ్రాగన్' చిత్ర బృందాన్ని కలిసి అభినందించారు. ఈ ఫోటోలను అశ్వంత్ మారిముత్తు తన సోషల్ మీడియా పేజీలో పంచుకున్నారు. ఈ ఫోటో వైరల్ అవుతోంది.

అశ్వంత్ మారిముత్తు పోస్ట్

విజయ్ డ్రాగన్ మూవీ టీమ్ ను అభినందించారు. అంతే కాదు విజయ్ తో  కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నానని అశ్వంత్ ఈ పోస్ట్ ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. 

Latest Videos

vuukle one pixel image
click me!