ఇదంతా జరిగి దాదాపు 43 సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా కాలం నుండి అమితాబ్ , శివన్న కలిసి కన్నడ సినిమాలో నటిస్తారని వార్తలు వినిపించాయి. నాగతిహళ్లి చంద్రశేఖర్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తారని అన్నారు, కానీ అది సాధ్యం కాలేదు. గత సంవత్సరం హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కూడా శివన్న పాల్గొంటారని చెప్పారు, అది కూడా జరగలేదు.