Jr NTR - Ram Charan Next Multistarrer: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సినిమా,టాలీవుడ్ ను హాలీవుడ్ లో నిలబెట్టిన సినిమా. దేశ వ్యాప్తంగా తెలుగు సినీపరిశ్రమ గర్వించేలా చేసిన సినిమా. మరోసారి తెలుగుజాతి తలెత్తుకునేలా చేసిన సినిమా. ఈసినిమాలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ పోటీ పడి నటించారు. ప్రపంచ వ్యాప్తంగా 1200కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఆర్ఆర్ఆర్. హాలీవుడ్ రేంజ్ లో గ్రామీ అవార్డ్ తో పాటు ఎన్ని అవార్డ్ లు సాధించింది. ఇవన్నీ అందరికి తెలిసినవే.
కాని వీరిద్దరి కాంబోలో మరో అద్భుతమైన సినిమా రాబోతోంది అని మీకు తెలుసా? తారక్, చరణ్ కాంబినేషన్ లో మరోసారి భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే వీరిద్దరు కలిసి చేసే ఆ భారీ బడ్జెట్ సినిమా ఏంటి..? దర్శకుడు ఎవరు? ఎప్పుడు ఈసినిమా స్టార్ట్ అవుతుంది.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఎదురవుతుంటాయి. అయితే ఈ ఇద్దరు హీరోలు కలిసి మరోసారి త్రిపుల్ ఆర్ సినిమాలు చేయబోతున్నారట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజమే అంటున్నారు టాలీవుడ్ జనాలు.
rrr 2 on cards says director ss rajamouli ram charan ntr junior
ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా అయిపోలేదట. ఈసినిమాకు సీక్వెల్ ఉందని, ఈ సినిమా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గతంలోనే ఓ సందర్భంలో చెప్పారు. ఆ సీక్వెల్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో మాత్రం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే.. జక్కన్న మహేష్ బాబు సినిమాతో బిజీ.. రామ్ చరణ్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ సినిమాలు చేయాలి, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కు కమిట్ అయ్యాడు, ఆతరువాత దేవర2 కూడా లైన్ లో ఉంది.
రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గరు ఫుల్ బిజీ ఓ ఐదారేళ్లు వీళ్లు కలిసే అవకాశం లేదు. ఆతరువాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. అందుకే ఇప్పట్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా సాధ్యం కాదనే చెప్పాలి. ఇక వీరి కాంబినేషన్ లో సినిమా మాత్రం పక్కా.. కాని అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తే మాత్రం భారీ స్థాయిలో, భారీ బడ్జెట్ తో, పాన్ వరల్డ్ మూవీగా వస్తుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. చూడాలి మరి మెగా నందమూరి ఫ్యాన్స్ కు నెక్ట్స్ ట్రీట్ ఎప్పుడు వస్తుందో.