Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌

Published : Jan 06, 2026, 06:04 PM IST

విజయ్‌ నటించిన `జన నాయకుడు` తెలుగులో వచ్చిన `భగవంత్‌ కేసరి` కాపీ అంటూ గత మూడు రోజులుగా ట్రోలింగ్‌ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా దీనిపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. 

PREV
14
విజయ్‌ చివరి మూవీ `జన నాయకుడు`

దళపతి విజయ్‌ హీరోగా నటిస్తోన్న చివరి మూవీ `జన నాయకుడు`. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. కేవీఎన్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. బాబీ డియోల్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 9న విడుదల కానుంది. ప్రభాస్‌ `ది రాజాసాబ్‌`కి పోటీగా ఇది రిలీజ్‌ అవుతుంది. దీంతో బాక్సాఫీసు వద్ద గట్టి పోటీని ఎదుర్కోబోతున్నారు విజయ్‌.

24
జన నాయకుడుకి సెన్సార్‌ సమస్యలు

తాజాగా `జన నాయకుడు` మూవీ సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉంది. అయితే రిలీజ్‌కి ఇంకా రెండు రోజులే ఉంది, కానీ సెన్సార్‌ కాకపోవడం ఆశ్చర్యంగా మారింది. ఈ చిత్రం సెన్సార్‌ సమస్యలను ఫేస్‌ చేస్తుందట. దీనిపై డిస్కషన్‌ జరుగుతుందని, సెన్సార్‌ బోర్డ్ అభ్యంతరం తెలుపుతుందని టాక్‌. దీనిపై నిర్మాతలు కోర్టు కి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇదిప్పుడు విజయ్‌ అభిమానులను కలవరానికి గురిచేస్తుంది. సినిమా రిలీజ్‌ ఉంటుందా? లేదా అనే సందేహంగా మారింది. ఈ రోజు, రేపటి మధ్యాహ్నం వరకు సెన్సార్‌ క్లియరెన్స్ వస్తే రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ వస్తుంది. లేదంటే వాయిదా పడే అవకాశం ఉంది.

34
జన నాయకుడు.. భగవంత్‌ కేసరికి కాపీనా?

ఈ క్రమంలో ఈ మూవీపై గత మూడు రోజులుగా మరో ట్రోలింగ్‌ నడుస్తోంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన `భగవంత్‌ కేసరి`కి రీమేక్‌ అని అంతా ప్రచారం జరుగుతుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ చూస్తే అచ్చం `భగవంత్‌ కేసరి`ని పోలి ఉంది. 70-80శాతం సీన్లు సేమ్‌ ఉన్నాయి. కొత్తగా తమిళనాడు రాజకీయాలను ప్రతిబింబించేలా ఉంది. అయితే రీమేక్‌ అనే విషయాన్ని ఇప్పటి వరకు టీమ్‌ ఎక్కడా చెప్పలేదు. దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా ఆ మధ్య దీనిపై సమాధానాన్ని దాటవేశారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

44
జన నాయకుడు రీమేక్‌పై నిర్మాత క్లారిటీ

`జన నాయకుడు` తెలుగులో వచ్చిన `భగవంత్‌ కేసరి`కి రీమేక్‌ అని స్పష్టం చేశారు. ఈ మూవీని తెలుగులో బాలయ్య హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత సాహు గారపాటి నిర్మించారు. తన షైన్‌ స్క్రీన్‌ పతాకంపై ఆయన నిర్మించారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా, శ్రీలీల కీలక పాత్రలో నటించింది. తెలుగులో ఇది పెద్ద హిట్‌ అయ్యింది. దీన్నే తమిళంలో విజయ్‌ హీరోగా `జన నాయకుడు` పేరుతో రీమేక్‌ చేస్తున్నారని ఇప్పుడు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. తమకు క్రెడిట్‌ని సినిమా టైటిల్స్ లో ఇస్తారని చెప్పారు. `జన నాయకుడు` మూవీ `భగవంత్‌ కేసరి`కి రీమేక్‌ అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన తెలుగులో చిరంజీవి హీరోగా `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీని చిరు కూతురు సుస్మిత కొణిదెలతో కలిసి నిర్మించారు. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు నిర్మాత. దీంతో ఇక `జ నాయకుడు` కాపీ అంటూ జరిగే ట్రోలింగ్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్టయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories