అత్తగారి ఊరిలో అమ్మాయిల గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్, స్కూల్ డేస్ లో రౌడీ హీరో ఏం చేశాడంటే?

Published : Apr 08, 2026, 04:35 PM IST

పెళ్లి తరువాత ఫస్ట్ టైమ్ అత్తగారి ఊరికి వెళ్లాడు విజయ్ దేవరకొండ. రష్మిక బంధువుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే?

PREV
14
అత్తగారి ఊరిలో విజయ్ దేవరకొండ...

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించిన ఈ ఇద్దరు స్టార్స్ పెళ్లి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పెళ్లి తరువాత కూడా ఏదో ఒక రకంగా హాట్ టాపిక్ అవుతుంది ఈ జంట. విజయ్ రష్మిక పెళ్లి జరిగి దాదాపు నెలన్నరకు పైనే అవుతుంది. ఆతరువాత కూడా ఏదో ఒక ఈవెంట్ తో వార్తల్లో నిలిచిన ఈ జంట.. తాజాగా మరోసారి మరో ఈవెంట్ లో మెరిశారు.

24
రష్మిక సొంత ఊరిలో రిసెప్షన్ ..

తాజాగా మంగళవారం కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లా, విరాజ్ పేట్ లో లో రష్మిక సొంతూరులో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించారు. కొడవ సాంప్రదాయానికి అనుగుణంగా ఈ రిసెప్షన్‌ను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ వేడుకకు రష్మిక కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు , స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరి పెళ్లికి హాజరు కాని రష్మిక బంధువులు, ఊరివారి కోసం ఈ వేడుకను నిర్వహించారు.

34
కొడవ సంప్రదాయ గెటప్ లో రష్మిక

ఈ రిసెష్పన్ లో రష్మిక కొడవ సంప్రదాయ గెటప్ లో కనిపించింది. ఇక ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “కూర్గ్ ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడి అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని నేను రష్మికను కలిసే ముందే నమ్మేవాడిని. ఆ అందమైన అమ్మాయిల్లో ఒకరిని నేను పెళ్లి చేసుకున్నాను” అని అన్నారు

44
రష్మిక చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాను..

అలాగే కూర్గ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, “నేను స్కూల్ చదివే రోజుల్లోనే మొదటిసారి హాలిడే వెకేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాంతంతో నాకు ఎంతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ తర్వాత మరోసారి వచ్చినప్పుడు నా స్నేహితుడి ఇంట్లో ఉన్నాను. అయితే ఆ స్నేహితుడు ఈ రోజు రిసెప్షన్‌కు రాలేదు... మరొకసారి మళ్లీ ఇక్కడికి వచ్చి రష్మిక చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాను” అని విజయ్ దేవరకొండ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories