సినిమా ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ చూస్తే, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుందని, క్లైమాక్స్ కి ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుందని, సినిమాని మలుపు తిప్పుతుందని అంటున్నారు. టీజర్, ట్రైలర్‌లో చూపించినవి కొంతే అని, సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుందని, భారీ యాక్షన్‌కి, ఎమోషన్స్ తోడు కావడం హైలైట్‌గా నిలుస్తుందని టాక్. ప్రేమ, ద్రోహం, ప్రతీకారమే సినిమా అని టాక్. విజువల్స్ మైండ్ బ్లోయింగ్. టెక్నీకల్‌గా సినిమా సాలిడ్‌గా ఉంటుందని సమాచారం.