మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రీరిలీజ్ బిజినెస్ తో రచ్చ చేస్తోంది. ఈసినిమాకు రైట్స్ కోసం వందల కోట్ల ఆఫర్లు వస్తున్నాయట. ఇంతకీ పెద్ది సినిమా ఓటీటీ రైట్స్ ఎంతో తెలుసా? నిజమెంత?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ శిష్యుడు,ఉప్పెన ఫేమ్.. దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. రాబోయే సినిమాల్లో సంచలనంగా మారబోతోంది? రామ్ చరణ్ సినిమా బాక్సాఫీస్ వద్దకు రాకముందే భారీ స్థాయిలో వ్యాపారం జరగడం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు భారీగా ఓటీటీ డీల్ జరుగుతున్నట్టు సమాచారం.
26
పెద్ది సినిమా భారీ ఓటీటీ డీల్..
ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. తెలుగుతో పాటు ఐదు భాషల హక్కులకు కలిపి దాదాపుగా130 కోట్లకు ఒప్పందం కుదిరినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే ఇంతటి భారీ మొత్తం రావడం టాలీవుడ్ ఇండస్ట్రీలో అరుదైన విషయం. అంతే కాదు నెట్ ప్లిక్స్ నుంచి మరో ఆఫర్ కూడా పెద్ది సినిమాకు వచ్చినట్టు తెలుస్తోంది.
36
పెద్దికి మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్..
గెలుపోటములకు సబంధం లేకుండా ఓటీటీ డీల్స్ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ పెద్ది సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. సినిమా థియేటర్లలో సాధించే విజయాన్ని బట్టి అదనంగా రూ.20 కోట్ల బోనస్‌ను ఇవ్వడానికి కూడా నెట్‌ఫ్లిక్స్ ముందుకు వచ్చినట్టు సమాచారం. అంటే ‘పెద్ది’ మూవీ సూపర్ హిట్ అయితే మొత్తం డిజిటల్ రిలీజ్ డీల్ 150 కోట్లకు చేరే అవకాశం ఉంది.
రామ్ చరణ్ అభిమానులు ఈసినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఈ కాంబినేషన్‌తోనే సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి.
56
రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ రచ్చ రచ్చ
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒక వైపు పెద్ది పహిల్వాన్‌గా, మరోవైపు క్రికెటర్‌గా ఆయన పాత్రలు ఉండనున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అదిరిపోయింది. ఈలుక్ లో రామ్ చరణ్ ను చూసిన అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. రామ్ చరణ్ హార్డ్ వర్క్, డెడికేషన్ కు అంతా ఫిదా అవుతున్నారు. ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్
66
పెద్ది తరువాత రామ్ చరణ్ సినిమా ఎవరితో?
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల కానుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని సమాచారం. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మార్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. పెద్ది సినిమా తరువాత రామ్ చరణ్ సుకుమార్ తో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు. రంగస్థలం రిలీజ్ అయిన చాలా కాలం గ్యాప్ తరువాత ఈ కాంబోలో సినిమా రాబోతోంది.