విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. మరోసారి విజయ్ దేవరకొండ మూవీ పాన్ ఇండియా చిత్రం గా రిలీజ్ కాబోతోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చివరి చిత్రం కింగ్డమ్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. అంతకు ముందు విజయ్ దేవరకొండ నటించిన కొన్ని సినిమాలు కూడా నిరాశ పరిచాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండకి ఒక మంచి హిట్టు అవసరం. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.
24
టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది
ఈ చిత్రానికి రౌడీ జనార్ధన అనే టైటిల్ అనౌన్స్ చేస్తూ తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. రౌడీ జనార్దన్ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది అనే చెప్పాలి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
34
పీరియాడిక్ డ్రామా
ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నట్లు టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. 'బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి విన్నావా, నేను చూశాను అనే వాయిస్ ఓవర్ తో టైటిల్ గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. విజయ్ దేవరకొండ కత్తి పట్టుకుని బీభత్సం సృష్టిస్తున్నాడు.
కళింగ పట్నంలో ఇంటికొకడు నేను రౌడీని అని చెప్పుకు తిరుగుతాడు. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు ఆంటూ విజయ్ దేవరకొండ చెబుతున్న డైలాగ్ తో ఈ చిత్రం ఎంత వయలెంట్ గా ఉండబోతోందో అర్థం అవుతోంది. మొత్తానికి కింగ్డమ్ లాగా మిస్ కాకూడదని విజయ్ దేవరకొండ గట్టిగా డిసైడ్ అయినట్లు ఉన్నాడు. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.